రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్ర శేఖర రావు డిసెంబర్ 4 న మహబూబ్ నగర్ జిల్లాలో సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయం ప్రారంభంతో పాటు , పలు అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాల శంకుస్థాపన ,ప్రారంభోత్సవాలు చేయనున్న దృష్ట్యా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు.
సోమవారం అయన ఎం వి ఎస్ కళాశాల మైదానంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొననున్న బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు .
ఈ సందర్భంగా ముఖ్య మంత్రి బహిరంగ సభకు హాజరయ్యే ప్రజలు, సదుపాయాలు, ఎంవిఎస్ కళాశాలకు వచ్చే రహదారి, శానిటేషన్ ,బారికేడ్లు ,పబ్లిక్ అడ్రస్ సిస్టం, తదితర అన్ని అంశాలపై జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు ఎస్పీ ఆర్ .వెంకటేశ్వర్లు ఇతర అధికారులతో చర్చించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరు కానున్న బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చేఆవకాశం ఉన్నందున తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించనున్న సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయము, మినీ శిల్పారామం ఆర్చి, పాత కలెక్టరేట్ వద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన, కెసిఆర్ ఎకో పార్కు లో బర్డు ఎన్ క్లోజర్ ప్రారంభం తదితర కార్యక్రమాల కు ఆయా శాఖల అధికారులు ఇతర అధికారుల సమన్వయంతో ముందుగానే అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని చెప్పారు. ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు .
జిల్లా కలెక్టర్ ఎస్ .వెంకటరావు, జిల్లా ఎస్పీఆర్ వెంకటేశ్వర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నంద లాల్ పవర్, అడిషనల్ ఎస్పి రాములు , మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, ఇంజనీర్ సుబ్రహ్మణ్యం,వివిధ శాఖల జిల్లా అధికారులు ,జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు రాజేశ్వర్గౌడ్ ,రైతుబంధు జిల్లా కోఆర్డినేటర్ గోపాల్ యాదవ్ ,డిసిసిబి అధ్యక్షులు నిజాం పాషా తదితరులు మంత్రి వెంట ఉన్నారు.