రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటన సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

పత్రికా ప్రకటన.   తేది:17.12.2021, వనపర్తి.

రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటన సందర్భంగా వనపర్తి మున్సిపాలిటీనందు జరుగుతున్న ప్లాంటేషన్,  శానిటేషన్ పనులను జిల్లా అదనపు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పరిశీలించారు.
శుక్రవారం వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో జిల్లా అదనపు కలెక్టర్ పర్యటించి, వార్డులోని పరిసరాలను, పారిశుద్ధ్యాన్ని పరిశీలించారు. దుకాణా దారులు రోడ్డు మీద చెత్తవేయడాన్ని చూసి వారికీ ఫైన్ వేయాలని మునిసిపల్ కమీషనర్ ను ఆయన ఆదేశించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు మీద ఎక్కడ చెత్త లేకుండా చూడాలని, ప్రజలలో పారిశుధ్యంపై అవగాహన కలిగించాలని మున్సిపల్ కమిషనర్ కు తెలిపారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలని, బాధ్యతగా తీసుకొని ఎక్కడ చెత్త వేయరాదని, మున్సిపాలిటీ ట్రాక్టర్ల లోనే చెత్త వేరు చేసి వేసే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన వివరించారు. నాటిన ప్రతి మొక్కను రక్షించే విధంగా చర్యలు చెప్పట్టాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు.
గాంధీచౌక్ లో జరుగుతున్న రోడ్డు విస్తారన పనులను జిల్లా అదనపు కలెక్టర్, మునిసిపల్ చైర్మన్ తో కలిసి పరిశీలించారు.
జిల్లా అదనపు కలెక్టర్ వెంట మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది, వార్డు కౌన్సిలర్ లు తదితరులు పాల్గొన్నారు.
………..
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post