slot anti rungkat 2023

slot anti rungkat 2023

slot deposit dana

2023

slot deposit dana

slot gacor

రాష్ట్ర ముఖ్యమంత్రి మానస పుత్రిక ఆయిన మన ఊరు మన బడి – మన బస్తీ మన బడి కార్యక్రమాన్ని సకాలంలో పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని రాష్ట విద్యా శాఖ మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి సూచించారు. – Information and Public Relations Department, Government of Telangana

రాష్ట్ర ముఖ్యమంత్రి మానస పుత్రిక ఆయిన మన ఊరు మన బడి – మన బస్తీ మన బడి కార్యక్రమాన్ని సకాలంలో పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని రాష్ట విద్యా శాఖ మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి సూచించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి మానస పుత్రిక ఆయిన మన ఊరు మన బడి – మన బస్తీ మన బడి కార్యక్రమాన్ని సకాలంలో పూర్తి చేసి ప్రారంభోత్సవానికి  సిద్ధం చేయాలని  రాష్ట విద్యా శాఖ మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి సూచించారు.  గురువారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో మన ఊరు మన బడి కార్యక్రమ అమలు పై సమీక్ష నిర్వహించారు.  ఈ అందర్బంగా ఆమె మాట్లాడుతూ మన ఊరు మనబడి కింద మొదటి విడతలో చేపట్టిన ప్రభుత్వ పాఠశాలల్లో 12 రకాల మౌళిక సదుపాయాలు కల్పించి ప్రయివేట్ స్కూల్ కు దీటుగా తీర్చిదిద్దెందుకు చేపట్టిన పనులు మార్చి చివరి వరకు పూర్తీ చేయాలని ఆదేశించారు. అంతకుముందు ప్రతిమండలంలో 2 పాఠశాలలను మోడల్ స్కూల్ గా ఎంచుకొని సకల సౌకర్యాలతో డిసెంబర్ చివరి కల్ల పూర్తి చేసి ప్రారంభోత్సవం చేసుకోడానికి సిద్ధం చేయాలని సూచించారు.  కొత్త ఫర్నిచర్ సైతం పంపించడం జరుగుతుందని, పాఠశాలల్లో పెయింటింగ్ పై ప్రత్యేక శ్రద్ధ వహించి  సుందరంగా పెయింటింగ్ వేయించాలన్నారు.  సోలార్ ఫ్యాన్ లు సైతం మొదటి విడతలో 500 పైచిలుకు పాఠశాలలకు పంపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందన్నారు.  పాఠశాలల పరిశుభ్రత, నిర్వహణ కింద రాబోయే 5 నెలలకు 130 కోట్లు నిధులు విడుదల చేయడం జరిగిందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.  పాఠశాలల్లో లైబ్రరీ రూమ్ ఏర్పాటు కు పుస్తకాలు చేయించడం జరుగుతుందని ఒక్కో జిల్లా నుండి కనీసం 150 నుండి 250 పాఠశాలల వరకు ఎంపిక చేసి పెట్టుకోవాల్సిందిగా తెలియజేసారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కోయ శ్రిహర్ష  మాట్లాడుతూ  నారాయణపేట జిల్లాలో మొదటి విడతలో చేపట్టిన 168 ప్రభుత్వ పాటశాలలకు  గాను 141 పాఠశాలలు 30 లక్షల కన్నా తక్కువ బడ్జెట్ పరిధిలో ఉన్నాయని వాటిలో పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయన్నారు. వాటిని సకాకంలో పూర్తి చేస్తామన్నారు.    ప్రతి మండలం నుండి 2 పాఠశాలలను మోడల్ పాఠశాలలుగా తీర్చిదిద్ది ప్రారంభోత్సవానికి డిసెంబర్ చివరి లోపు సిద్ధం చేయడం జరుగుతుందన్నారు.     ప్రాథమిక పాఠశాలలో లైబ్రరీ రూమ్ ఏర్పాటుకు ఇప్పటికే   పాఠశాలలు గుర్తించడం జరిగిందన్నారు.  పాఠశాల నిర్వహణ మరుగుదొడ్లు, పరిశుభ్రత కై నిధులను సద్వినియోగం చేసుకుంటామని తెలియజేశారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ట్.ఎస్. ఈ.డబ్ల్యూ.ఐడి.సి  చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి,  ప్రిన్సిపల్  సెక్రటరీ వాకాటి కరుణ,   విద్యాశాఖ కమిషనర్ దేవసేన, జిల్లా నుండి ఆదనవు కలెక్టర్  మయంక్ మిత్తల్, ఇఇ. పీ.ఆర్  నరేందర్, R&B De రాములు , విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post