రాష్ట్ర ముఖ్యమంత్రి సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం ప్రారంభోత్సవం చేయనున్న దృష్ట్యా బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించిన వరంగల్ పోలీస్ కమీషనర్ తరుణ్ జోషి,

ప్రచురణార్థం-2
జనగామ, డిశంబర్ 17: ఈ నెల 20వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం ప్రారంభోత్సవం చేయనున్న దృష్ట్యా బందోబస్తు ఏర్పాట్లను వరంగల్ పోలీస్ కమీషనర్ తరుణ్ జోషి, జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య తో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి భవన సముదాయం ప్రారంభోత్సవం వివరాలు, ముఖ్యమంత్రి, వివిఐపిలు, అధికారుల ప్రవేశం, వాహనాల పార్కింగ్ తదితరాలపై క్షేత్ర పరిశీలన చేశారు. జాతీయ పతాక ఆవిష్కరణ, ప్రారంభోత్సవం, కలెక్టర్ చాంబర్ లో కార్యక్రమం, జిల్లా అధికారులతో సమావేశం, మధ్యాహ్న భోజనం, ఎక్కడెక్కడ ఎంతమందికి అనుమతి, చేపట్టాల్సిన భద్రతా చర్యలపై చర్చించారు.
ఈ సందర్భంగా డిసిపి బి. శ్రీనివాస రెడ్డి, అడిషనల్ డిసిపి లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పి. సాయి చైతన్య, అదనపు కలెక్టర్ ఏ. భాస్కర్ రావు, అడిషనల్ డిసిపి సిఏఆర్ ఎం. భీమ్ రావ్, అధికారులు తదితరులు ఉన్నారు.

Share This Post