రాష్ట్ర ముఖ్యమంత్రి సూచనల మేరకు 2019, 2020 సంవత్సరములో తెలంగాణకు హరితహారం ద్వారా నాటిన మొక్కల మూల్యాంకనం సైట్ ల వారిగా నిర్వహించి ఆన్లైన్ లో అప్లోడ్ చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి శాంతకుమారి అటవీ శాఖ అధికారులను ఆదేశించారు.

పత్రిక ప్రకటన

తేది: 30-8-2021

నారాయణపేట జిల్లా

రాష్ట్ర ముఖ్యమంత్రి సూచనల మేరకు 2019, 2020 సంవత్సరములో తెలంగాణకు హరితహారం ద్వారా నాటిన మొక్కల మూల్యాంకనం  సైట్ ల వారిగా నిర్వహించి ఆన్లైన్ లో అప్లోడ్ చేయాల్సిందిగా  ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి శాంతకుమారి అటవీ శాఖ అధికారులను ఆదేశించారు.  సోమవారం ఉదయం హైదరాబాద్ నుండి  వర్చువల్ సమావేశం ద్వారా జిల్లా కలెక్టర్ లు, అటవీ శాఖ అధికారులు, డిఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్లకు పలు సూచనలు చేశారు.  ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ 2019, 2020 లో ఆయా జిల్లాల్లో మున్సిపాలిటీ, పంచాయతీరాజ్, డిఆర్డీఏ ద్వారా నాటిన మొక్కల ప్రస్తుత స్థితిగతులు ఏ విధంగా ఉంది, అవి ఎంతమేరకు పెరిగాయి,  చనిపోయిన వాటి స్థానంలో 2021 లో ఎన్ని కొత్త మొక్కలు నాటారు, అవి సరి అయిన దిశగా పెరుగుతున్నాయా లేదా అనే వివరాలతో కూడిన నివేదికను నిర్ణిత ప్రొఫార్మలో పొందుపరచి రోజువారీగా తెలంగాణా ఫారెస్ట్ మేనేజ్మెంట్  ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు.  దీనికొఱకు ప్రతి మండలంలో ఇద్దరు అధికారులతో పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేయాలని ఇందులో ఒక అటవీ శాఖ అధికారి మరొకరు సంబంధిత శాఖ సిబ్బంది లేదా అధికారిని నియమించాలన్నారు.  ఆన్లైన్లో ఇప్పటికే నమోదు అయివున్న సైట్ లను ప్రత్యక్షంగా వీక్షించి వాస్తవమైన నివేదికను సేకరించి ధృవీకరించి అప్లోడ్ చేయాలన్నారు.  ఇందుకు సంబంధించిన వెబ్ సైట్ వివరాలపై అవగాహన కల్పించారు.  సెప్టెంబర్, 15 వరకు రోజువారీగా నిర్దేశించిన సైట్లలో వివరాలు సేకరించి నివేదికలు ఆన్లైన్ లో పొందుపరచాలని సూచించారు.

ఈ సమావేశంలో పాల్గొన్న అదనపు కలెక్టర్ కె. చంద్రా రెడ్డి మాట్లాడుతూ నారాయణపేట జిల్లాలో  2019 సంవత్సరంలో మున్సిపాలిటీ ద్వారా 1, పంచాయతీరాజ్ ఇతర శాఖల ద్వారా 121 సైట్ లలో మొక్కలు నాటడం జరిగిందన్నారు.  2020 లో మున్సిపాలిటీ ద్వారా 2, ఇతర శాఖల ద్వారా 94 సైట్లలో  హరితహారం మొక్కలు పెంచడం జరిగిందన్నారు. మొత్తం 218 సైట్లను పర్యవేక్షణ చేసి నివేదిక ఇచ్చేందుకు 14 బృందాలను ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జరిచేయడం జరిగిందన్నారు.  బృందాలకు శిక్షణ ఇచ్చి క్షేత్రస్థాయిలో  వివరాలు సేకరించడం జరుగుతుందన్నారు.  సేకరించిన సమాచారం నిర్ణిత ప్రొఫార్మలో పొందుపరచి ఆన్లైన్ ద్వారా అప్లోడ్ చేసేందుకు పకడ్బందీగ చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

ఈ వర్చువల్ సమావేశంలో వ్యవసాయ శాఖ తరపున ఆర్.యం. దొబ్రియల్,  జిల్లా నుండి పి.డి డిఆర్ డీ ఏ గోపాల్ నాయక్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జి. నారాయణ రావు, డి.పి.ఓ మురళి, మున్సిపల్ కమిషనర్లు, తడితరులు పాల్గొన్నారు.

——————

జిల్లా పౌర సంబంధాల అధికారి నారాయణపేట ద్వారా జారీ.

Share This Post