అన్ని చెరువులు, కుంటల వద్ద శుభ్రమైన వాతావరణం కల్పించాలని, అవసరమైన చోట మరమ్మతులు చేయాలని, బతుకమ్మ పండుగలో పోటీలు నిర్వహించి జిల్లా, మండల, గ్రామ స్థాయిలో బహుమతులు ప్రదానం చేయాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో బతుకమ్మలో పాల్గొనుటకు మహిళా సంఘాలను ఏరియా కోఆర్డినేటర్ల ద్వారా జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ ఏర్పాటు చేయాలని తెలిపారు. భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో బతుకమ్మ పండుగ ఏర్పాట్లు ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్లు నిర్వహించాలని తెలిపారు. స్థానిక పెద్ద చెరువు వద్ద నీటి పారుదల శాఖ, మున్సిపల్ కమిషనర్ చూడాలని, జిల్లా మత్స్యశాఖ గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని తెలిపారు. పోలీస్ డిప్యూటీ కమిషనర్ సద్దుల బతుకమ్మ పండుగ వరకు బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అంబులెన్స్, అత్యవసర చికిత్స కోసం ఏర్పాట్లు నిర్వహించాలని, బోనగిరి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రతిరోజు సాయంత్రం కార్యక్రమం పూర్తి అయ్యేవరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని విద్యాశాఖ నోడల్ ఆఫీసర్ కు సూచించారు. గ్రామాలలో కుంటలు, చెరువుల వద్ద పారిశుధ్యం, పరిశుభ్రత పాటించేలా జిల్లా పంచాయతీ అధికారి, పంచాయతీరాజ్ సిబ్బంది చర్యలు తీసుకోవాలని తెలిపారు. భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో రోజూ మహిళలు వచ్చి బతుకమ్మలో పాల్గొనేలా, అన్ని ప్రభుత్వ శాఖల నుండి మహిళా ఉద్యోగులు పాల్గొనేలా చూడాలని మెప్మా, ఐసీడీఎస్ అధికారులకు సూచించారు. జిల్లా ఉద్యానవన శాఖ 13 వ తేదీన తెలంగాణ వంటకాలతో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించాలని.
అన్ని శాఖల అధికారులు సమన్వయంతో బతుకమ్మ పండుగ ఉత్సవాలను జయప్రదం చేయాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు.
