రాష్ట్ర విద్యా శాఖ మంత్రి చేతుల మీదుగా రేపు ప్రారంభించనున్న మన ఊరు మన బడి శంఖుస్థాపన పనుల ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలి – జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

రాష్ట్ర విద్యా శాఖ మంత్రి చేతుల మీదుగా రేపు ప్రారంభించనున్న మన ఊరు మన బడి శంఖుస్థాపన పనుల ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం నాగర్ కర్నూల్ మండలంలోని గగ్గలపల్లి ప్రాథమిక పాఠశాల, తాడూర్ మండలం మెడిపూర్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో చేపట్టనున్న మరమ్మతులు, అదనపు గదుల నిర్మాణం పనులను పరిశీలించారు. గగ్గలపల్లి ప్రాథమిక పాఠశాలలో అదనపు గదుల నిర్మాణం, ఇతర మౌళిక సదుపాయాల కల్పనకు రూ. 46.16 లక్షలతో చేపట్టనున్న పనులకు మంత్రులు భూమి పూజ చేయనున్నారు. తాడూర్ మండలంలోని మెడిపూర్ ప్రాథమిక పాఠశాల ఆధునీకరణకు రూ. 34 లక్షలు, అక్కడే ఉన్న ఉన్నత పాఠశాలకు 1.14 కోట్ల నిధులతో ఆధునికరించే పనులకు శంఖుస్థాపనలు చేయనున్నారు. ఇంకా ఏమైనా మార్పు చేర్పులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.

Share This Post