రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కోహెడ మార్కెట్ పై సమావేశం నిర్వహణ.

*హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, హాజరైన వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు గారు, ప్రత్యేక కమీషనర్ హన్మంతు గారు, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీభాయి గారు, పర్సన్ ఇంచార్జ్ మరియు అదనపు సంచాలకులు లక్ష్మణుడు గారు, ఇంచార్జ్ కార్యదర్శి చిలుక నర్సింహారెడ్డి గారు, ఇంజనీరింగ్ అధికారులు, సంస్థ ప్రతినిధులు*

178 ఎకరాలలో కోహెడ మార్కెట్ ను నిర్మించ తలపెట్టిన మార్కెటింగ్ శాఖ

41.57 ఎకరాలలో షెడ్ల నిర్మాణం

39.70 ఎకరాలలో 681 కమీషన్ ఏజెంట్ల దుకాణాలు

19.71 ఎకరాలలో కోల్డ్ స్టోరేజీల నిర్మాణం

45 ఎకరాలలో రహదారుల నిర్మాణం

24.44 ఎకరాలలో పార్కింగ్ సౌకర్యం

రూ.400 పై చిలుకు కోట్లతో మార్కెట్ ఏర్పాటు

వయాంట్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (గుర్ గావ్)కు మాస్టర్‌ లే అవుట్, ఇంజనీరింగ్ డిజైన్స్, ఎస్టిమేట్లకు టెండర్ పై  అప్పగింత

కోహెడ మార్కెట్ స్థలం, బాటసింగారం మార్కెట్ తో పాటు, కొన్ని దేశాలు, దేశంలోని ప్రముఖ మార్కెట్ లు ఆజాద్ పూర్ (న్యూఢిల్లీ), వాసి (ముంబయి), రాజ్ కోట్ మరియు బరుదా (గుజరాత్) మార్కెట్లను సందర్శించి లే అవుట్ల నమూనా తయారీ

కంపెనీ నమూనా లే అవుట్లపై 27.05.2022 నుండి  30.07.2022 వరకు పలుమార్లు చర్చలు

ఈ రోజు రెండు లే అవుట్లను పరిశీలించిన సమావేశం

పలు మార్పులు, చేర్పులకు ఆదేశించిన మంత్రిగారు .. తదుపరి ముఖ్యమంత్రి గారి పరిశీలనార్ధం సమర్పించి నిర్ణయించడం జరుగుతుంది

ఆసియాలోనే అత్యంత పెద్దదిగా కోహెడ మార్కెట్ నిర్మాణం

ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఉండడం, అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గరగా ఉండడం, త్వరలో రీజినల్ రింగ్ రోడ్ రానున్న నేపథ్యంలో కోహెడ మార్కెట్ అత్యంత ప్రాధాన్యం సంతరించుకోనున్నది

హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, హాజరైన వ్యవసాయ శాఖ  కార్యదర్శి రఘునందన్ రావు గారు, ప్రత్యేక కమీషనర్ హన్మంతు గారు, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీభాయి గారు, పర్సన్ ఇంచార్జ్ మరియు అదనపు సంచాలకులు లక్ష్మణుడు గారు, ఇంచార్జ్ కార్యదర్శి చిలుక నర్సింహారెడ్డి గారు, ఇంజనీరింగ్ అధికారులు, సంస్థ ప్రతినిధులు.

Share This Post