రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి ( సెప్టెంబర్ 16) స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టి అందరి సహకారంతో వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లకు సూచించారు.

పత్రికా ప్రకటన
సంగారెడ్డి, సెప్టెంబర్ 15:–

రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి ( సెప్టెంబర్ 16) స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టి అందరి సహకారంతో వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లకు సూచించారు.

బుధవారం హైదరాబాద్ నుండి ఆయన జిల్లా కలెక్టర్లు ,జెడ్పి చైర్మెన్లు, అదనపు కలెక్టర్లు ,జడ్పీ సీఈఓ లు ,మున్సిపల్ కమిషనర్ లు ,జిల్లా పంచాయతీ అధికారులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ కార్యక్రమంపై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న స్పెషల్ వ్యాక్సినెషన్ డ్రైవ్ అందరి సహకారంతో వంద శాతం విజయవంతం చేయాలని ఆయన కోరారు.రోజుకు మూడు లక్షల మందికి టీకా వేయడం లక్ష్యంగా ఉందన్నారు. హ్యాబిటేషన్ వారీగా మరియు పట్టణ ప్రాంతాల్లో వార్డు వారిగా వ్యాక్సినేషన్ పూర్తిచేసి డిక్లరేషన్ చేయాలన్నారు. డిఎంఅండ్హెచ్ఓ లు పూర్తిస్థాయిలో ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయాలని సూచించారు.

వ్యాక్సినేషన్ పూర్తయిన ఇళ్లకు స్టిక్కర్లు వేయాలని సూచించారు. ఒక ఉద్యమంలా వ్యాక్సినేషన్ జరగాలన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు అందరిని భాగస్వాములను చేయాలని సూచించారు.
రాష్ట్రంలో రెండు కోట్ల కు పైగా ప్రజలకు వాక్సినేషన్ ఇవ్వడం జరిగిందన్నారు. వ్యాక్సినేషన్ చాలా చక్కగా పూర్తి చేశారని, ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నానని ఆయన అన్నారు. రాష్ట్రం లో కోవిడ్ ను అరికట్టడం లోనూ వైద్య ఆరోగ్య శాఖ , ఆయా శాఖలు అప్రమత్తంగా పని చేశాయన్నారు.

జిల్లా కలెక్టర్ హనుమంతరావు జిల్లాలో రేపటి నుండి ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టడానికి అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నట్లు ప్రధాన కార్యదర్శి కి తెలిపారు.

జిల్లాలో జూలై 1 నుండి ఇప్పటి వరకు 41,367 రాపిడ్ టెస్టులు, 8158 ఆర్ టి పి సి ఆర్ టెస్టులను చేశామని తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా 40 ప్రభుత్వ వాక్సినేషన్ సెంటర్లు ఉన్నాయని, వ్యాక్సినేషన్ కు 14.5 లక్షల మంది జనాభా అర్హులు కాగా, ఇప్పటివరకు 5,75,444 మందికి వాక్సినేషన్ ఇవ్వడం జరిగిందన్నారు. జులై నుండి సెప్టెంబర్ 14 వరకు 2,67,900 మందికి టీకా ఇవ్వడం జరిగిందని వివరించారు.

60 సంవత్సరాలు పైబడిన 69,353 మందికి, 45 సంవత్సరాలు పైబడిన 1,99,112 మందికి, 18 సంవత్సరాలు పైబడిన 2,77,187 మందికి వాక్సినేషన్ వేసామని తెలిపారు.
4,19,297 మందికి ఒక డోసు, 1,56,147 మందికి రెండు డోసులు పూర్తయ్యాయని సి ఎస్ కు తెలిపారు.
జిల్లాలో ఆరు ఆక్సిజన్ ప్లాంట్స్ ఉన్నాయని, సంగారెడ్డి జిల్లా ఆసుపత్రి, పటాన్చెరు, జహీరాబాద్, జోగిపేట, నారాయణఖేడ్ ఏరియా ఆస్పత్రులు, మిర్జాపూర్ పీహెచ్సీలో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేశామని త్వరలో అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు.

జిల్లా ఆస్పత్రిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో పూర్తిస్థాయిలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంతున్నామని తెలిపారు. జిల్లాలోని ప్రతి ఆవాస ప్రాంతం, మున్సిపల్ పరిధిలో ఇంటింటికి వెళ్లి వ్యాక్సినేషన్ పూర్తయిన ఇంటికి
స్టి క్కర్ వేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అందరి సహకారంతో స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ను విజయవంతం చేస్తామని తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో వరంగల్ జిల్లా నుండి ఇ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు.
జిల్లా నుండి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ, అదనపు కలెక్టర్ రాజర్షి షా, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డిఎంఅండ్హెచ్ఓ గాయత్రి దేవి, డిపిఓ సురేష్ మోహన్ , తదితరులు పాల్గొన్నారు.

Share This Post