రాష్ట్ర వ్యాప్తంగా 18 సంవత్సరాల వయస్సు నిండిన ప్రతి ఒక్కరికి కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యాంప్ ను అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయం తో పని చేసి విజయవంతం చేయాలని రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు

రాష్ట్ర వ్యాప్తంగా 18 సంవత్సరాల వయస్సు నిండిన ప్రతి ఒక్కరికి కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యాంప్ ను అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయం తో పని చేసి విజయవంతం చేయాలని రాష్ట్ర ఆబ్కారీ,  పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.  శుక్రవారం సాయంత్రం నారాయణపేట జిల్లాలో జరుగుచున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సందర్శించారు.  వెటర్నరీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రంలో ప్రక్రియను పరిశీలించిన మంత్రి జిల్లాలో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని పిలుపునిచ్చారు.  గ్రామాలు, మున్సిపల్ వార్డులో పోటీ ఉండాలని ఏ గ్రామం, ఏ వార్డు ముందుగా వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుంటారో వారికి బహుమతి ఇవ్వడం జరుగుతుందన్నారు.

జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి, స్థానిక శాసన సభ్యులు యస్. రాజేందర్ రెడ్డి, మక్తల్ శాసన సభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, జడ్పి చైర్మన్ వనజమ్మ, ఎస్పీ డా. చేతన, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు మంత్రి వెంట పాల్గొన్నారు.

Share This Post