రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన సేవలు చిరస్మరణీయం

రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన సేవలు చిరస్మరణీయం

0 0 0 0

     తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విద్యార్థిదశ నుండే పోరాడిన మహోన్నత వ్యక్తి, తెలంగాణ సిద్దాంతకర్త ప్రోఫేసర్ కొత్తపల్లి జయశకర్ సార్ అని జిల్లా అదనపు కలెక్టర్లు గరీమా అగర్వాల్, శ్యాంప్రసాద్ లాల్ అన్నారు.

     శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రోఫేసర్ కొత్తపల్లి జయశంకర్ 88వ జయంతి సందర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.  ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరు పొందిన  ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారు ఆగస్టు 6,1934 వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేటలో జన్మించారని అన్నారు. 1952 లో నాన్ ముల్కీ ఉద్యమంలో పాల్గోన్నారని, 1969  తెలంగాణ  ఉద్యమంలో చురుగ్గా పాల్గోన్నారని అన్నారు.  ప్రోఫెసర్ జయశంకర్, వారు  ఎంతో మందికి మార్గనిర్దేశకులని పేర్కోన్నారు.  తెలంగాణ సాధన వలన సాధించే విజయాలను గురించి ముందుచూపుతో అలోచించిన వ్యక్తి ప్రోఫెసర్ జయశంకర్ అని కొనియాడారు.

      ఈ కార్యక్రమంలో పోలీస్ కమీషనర్ వి.సత్యనారాయణ, జిల్లా బీసీ సంక్షేమ అధికారి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జువేరియా, పిడి మెప్మా రవీందర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వి శ్రీధర్, జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, డిఆర్డిఏ శ్రీలత, కలెక్టరేట్ ఏఓ నారాయణ, అన్నిశాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గోన్నారు.

Share This Post