రాష్ట ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు ఆకాంక్షలు, ముందు చూపుతో చేసిన సూచనల ప్రకారం ధరణి పోర్టల్ ను అభివృద్ధి చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు.

పత్రికా  ప్రకటన                                                               తేది: 4.09.2021

రాష్ట  ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు ఆకాంక్షలు, ముందు చూపుతో చేసిన సూచనల ప్రకారం ధరణి  పోర్టల్ ను అభివృద్ధి చేసినట్లు రాష్ట్ర  ప్రభుత్వ  ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు.    

పది జిల్లాలకు కొత్తగా నియమితులైన జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేష్ కుమార్ శనివారం బిఆర్ కెఆర్ భవన్,హైద్రాబాద్ నుండి నిర్వహించిన  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  ధరణి వ్యవస్థపై  ఓరియేంటేషన్ కార్యక్రమం నిర్వహించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అవగాహన  కల్పించారు. భూ రికార్డులను  సమగ్రంగా ఏకీకృతంగా  నిర్వహించుటకు ట్రాన్స్ యాక్షన్  లను ఎప్పటికప్పుడు ఆధునీకరించడానికి ప్రభుత్వం చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ధరణి పోర్టల్  ఒకటి అని ప్రధాన కార్యదర్శి తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, పారదర్శకంగా పనిచేసే విధంగా ధరణి మాడ్యూల్స్ ను అభివృద్ధి చేసినట్లు తెలిపారు.

ధరణి ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం ఆన్ లైన్ స్లాట్ బుకింగ్ ఆధారంగా మాత్రమే పని చేస్తుందని ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఈ వ్యవస్థను సక్రమంగా అమలు చేసేలా చూడాలని, పెండింగ్ లో ఉన్న ధరణి గ్రీవేన్స్ ను  క్లియర్ చేయడానికి ప్రత్యేక దృష్టి సారించాలని  జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.  పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ధరణి గ్రీవేన్స్ ను పరిష్కరించడంపై ఉదాహరణలతో  జిల్లా కలెక్టర్లకు  వివరించారు. కలెక్టర్ ల ఆధీనంలో కొనసాగు తున్న ధరణి పోర్టల్ ను పకడ్బందీగా నిర్వహించేందుకు పూర్తి స్థాయి అవగాహన తో ఉండాలని సీఎస్ నూతన కలెక్టర్లకు సూచించారు. సీసీఎల్ఏ అధికారులు పిపిటి ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ మ్యుటేషన్, పట్టాదారు పాస్ బుక్ తదితర వివరాలపై అవగాహన కల్పించారు.

జోగులాంబ గద్వాల్  జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ధరణి ద్వారా భూ సంబంధిత సమస్యలు విజయవంతంగా పరిష్కరిస్తూ అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. జిల్లాలో గ్రీవెన్స్ సంబంధిత భూ సమస్యలు ధరణి వివిధ మాడ్యూల్స్ ద్వారా   పరిష్కారం చేసే విధానాన్నితెలిపారు.  జిల్లా కలెక్టర్ గారి తో పాటు, అదనపు కలెక్టర్ రఘురాం శర్మ, తదితరులు పాల్గొన్నారు. 

 —————————————————————————- జిల్లా పౌర సంబందాల అధికారి జోగులాంబ గద్వాల్ గారి చే జారీ చేయనైనది

You need to add a widget, row, or prebuilt layout before you’ll see anything here. 🙂

Share This Post