రిజిస్టర్ నిర్వహణ సక్రమంగా చేపట్టాలి: జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ –

చిల్డ్రన్ హోమ్, స్వచ్ఛంద సంస్థల రిజిస్టర్లు నిర్వహణ సక్రమంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ అన్నారు. చిల్డ్రన్ హోమ్, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న బాలుర, బాలికల వసతిగృహాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. చిన్నారులకు అవసరమైన క్రీడా సామాగ్రి పరికరాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఆర్ బి ఎస్ కె వైద్య బృందం వసతి గృహాలకు వెళ్లి ప్రతి నెల వైద్య పరీక్షలు చేయాలని కోరారు. చిల్డ్రన్ హోమ్ కు సోలార్ యూనిట్ ఏర్పాటు చేసి విద్యుత్ సౌకర్యం కల్పించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. స్వచ్ఛంద సంస్థల పర్యవేక్షణలో ఉన్న వసతిగృహాల రిజిస్టర్లు ఆడిట్ చేయించాలని పేర్కొన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ అన్యోన్య, సి డబ్ల్యూ సి చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్, అధికారులు పాల్గొన్నారు. —————— జిల్లా సమాచార, పౌర సంబంధాల అధికారి కార్యాలయం కామారెడ్డి చే జారీ చేయనైనది.

Share This Post