రుణమేళా ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి:: జిల్లా కలెక్టర్ జి.రవి

ప్రచురణార్థం-1 తేది.28.10.2021
రుణమేళా ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి:: జిల్లా కలెక్టర్ జి.రవి
• అధిక వడ్డి ఆశతో ప్రైవేటు వ్యాపారుల వద్ద మోసపోవద్దు
• ప్రభుత్వం అందించే వివిధ పోదుపు పథకాలను వినియోగించుకోవాలి
• ఆర్థిక పరిస్థితి పునరుద్దరణకు దేశవ్యాప్తంగా రుణమేళా నిర్వహణ
• రుణం తీసుకున్న సోమ్మును దుబారా చేయవద్దు
• అక్రమాలకు పాల్పడే వ్యక్తులు, స్వశక్తి సంఘాల పై కఠిన చర్యలు
డిజిటల్ లావాదేవిలను ప్రొత్సహించేలా చర్యలు
• సకాలంలో రుణాలను చెల్లించాలి
• పద్మనాయక కళ్యాణ మండపంలో నిర్వహించిన రుణమేళా కార్యక్రమంలో పాల్గోన్న జిల్లా కలెక్టర్
జగిత్యాల, అక్టోబర్ 28:- బ్యాంకర్లు నిర్వహిస్తున్న రుణమేళా కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జి.రవి పిలుపునిచ్చారు. గురువారం పద్మనాయక కళ్యాణమండపంలో బ్యాంకర్లు నిర్వహించిన మెగా రుణమేళా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గోన్నారు. దేశాభివృద్దిలో బ్యాంకులు కీలకపాత్ర పోషిస్తున్నాయని కలెక్టర్ తెలిపారు. మన జిల్లాలో 20 బ్యాంకులకు సంబంధించి 122 బ్రాంచులు ప్రజలకు సేవలందిస్తున్నాయని, వీటి పనితీరు పై నిన్న డిసిసి సమావేశం నిర్వహించామని తెలిపారు. రుణసదుపాయ కల్పన, ప్రభుత్వ పథకాల అమలు తీరు, బ్యాంకుల ప్రదర్శన వంటి అంశాలలో మన జిల్లాలోని బ్యాంకులు మంచి ప్రదర్శన కనబర్చాయని, దానికి వారిని అభినందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. కరోనా సంక్షోభం కారణంగా గత 2 సంవత్సరాలుగా ఆర్థిక వ్యవస్థ చాలా దెబ్బదిందని, కుటీర పరిశ్రమల నుంచి పెద్ద కంపేనీల వరకు ,సామాన్యుల నుంచి పెద్ద వ్యాపారవేత్తలు సైతం ఆర్థికంగా దెబ్బతిన్నారని కలెక్టర్ తెలిపారు. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కొంచెం కొలుకుంటున్నామని, అందరికి వ్యాక్సినేషన్ అందుబాటులోకి తీసుకొని వచ్చామని అన్నారు. ఆర్థికవ్యవస్థ పునరుద్దరణ కొరకు కేంద్ర ప్రభుత్వం ప్రజల వద్దకు బ్యాంకింగ్ వ్యవస్థను తీసుకొని వెళ్లడానికి క్రెడిట్ ఔట్ రీచ్ ప్రొగ్రాం(రుణమేళా) చేపట్టిందని కలెక్టర్ తెలిపారు. బ్యాంకులు ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రజలు పరిశీలించి బ్యాంకుల పాలసీలకు సంబందించి పోస్టర్లు, పాంప్లెట్లను పరిశీలించి వారికి అనుకూలంగా ఉన్న బ్యాంకుల వద్ద నుంచి అవసరమైన మేర రుణాలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.అధిక వడ్డి ఆశతో అనేక మంది ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు ప్రజలకు ఆశచుపి మోసగిస్తున్నారని, అటువంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. బ్యాంకులు వాహన కోనుగొలు, ఇంటి నిర్మాణం, విద్యా, వ్యాపారం వంటి పలు రకాల రుణాలు అందిస్తారని , ముద్రా స్కీం ద్వారా వ్యాపారం ప్రారంభించేందుకు 10 లక్షల వరకు రుణం ఎలాంటి పూచికత్తు లేకుండా అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఉపాథి పెంపొందించుటకు మరియు నూతన వ్యాపారాలు నెల కోల్పే దిశగా స్టాండ్ అప్ ఇండియా,ముద్రా రుణాలు, ప్రధానమంత్రి స్వనిధి పథకం, ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం, ఆహార సూక్ష్మ పథకం, కిసాన్ క్రెడిట్ కార్డు వంటి పథకాల ద్వారా రుణాలు అందిస్తుందని తెలిపారు. ప్రజలు తమ వద్ద ఉన్న సోమ్ము పెట్టుబడి పెట్టేందుకు విలుగా ప్రబుత్వం అటల్ పెన్షన్ యోజన, సుకన్య సమృద్ది యోజన, పిపిఎఫ్, ఎన్.పి.ఎస్ వంటి పోదుపు పథకాలు సైతం అందుబాటులొ ఉన్నాయని తెలిపారు. ప్రజలు తీసుకున్న రుణాన్ని దుబారా చేయవద్దని, అవసరానికి మాత్రమే వినియోగించాలని, సకాలంలో తీసుకున్న రుణానికి సంబంధించిన కుస్తి చేల్లించాలని కలెక్టర్ సూచించారు. ప్రస్తుతం 50 కోట్లకు పైగా రుణాలను స్వశక్తి వహిళా సంఘాలకు బ్యాంకర్లు రుణమేళా లో అందిస్తున్నారని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. స్వశ్తకి మహిళా సంఘాల చిన్న పరిశ్రమలు నెలకోల్పేందుకు అవసరమైన సహయ సహకారాలు అందిస్తున్నామని, వారికి జూట్ సంచుల తయారీ వంటి వివిధ అంశాలలో శిక్షణ అందిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని కొన్ని స్వశక్తి సంఘాలు పలు మోసాలకు పాల్పడుతూ అర్హతకంటే ఎక్కువ రుణాలు పొందడం, బ్యాంకులను మోసం చేయడం గుర్తిస్తున్నామని, వారు తమ పద్దతి మార్చుకోవాలని కలెక్టర్ హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడే వారిని గుర్తించి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేసారు. ప్రభుత్వం అందించే వివిధ సంక్షేమ పథకాలు నేరుగా లబ్దిదారుల ఖాతాలకు బ్యాంకుల ద్వారా చేరుకుంటాయని , వీరు డిజీటల్ లావాదేవిలు చేసే విధంగా ప్రోత్సహించాలని, దీనికి సంబంధించి అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బ్యాంకర్లకు సూచించారు.
1524 మంది స్వయం సహాయక సంఘాల సబ్యులకు సుమారు 100 కోట్ల రుణాల చెక్కులను అందచేశారు.
లీడ్ బ్యాంకు మేనేజర్ వెంకట రెడ్డి, యూ.బి.ఐ. డి.జి.ఎం., అరుణ్ కుమార్ , ఎస్.బి.ఐ.ఆర్.ఎం. బి.శ్రీనివాస్, ఏ.జి.ఎం. సురేందర్ నాయక్, టి.జి.బి. ఆర్.ఎం. గంగాధర్,సతీష్, కె.డి.సి.సి. ఆర్.ఎం. రియాజ్, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు రమ్య, అదనపు గ్రామీణాభివృద్ది అధికారి సుదీర్, వివిధ బ్యాంకు కంట్రోలర్లు, మేనేజర్లు, ప్రతి నిధులు, ప్రజలు, ఖాతాదారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు.

రుణమేళా ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి:: జిల్లా కలెక్టర్ జి.రవి

జిల్లా పౌర సంబంధాల అధికారి, జగిత్యాలచే జారీచేయనైనది

Share This Post