రుణాలతోనే ఆర్థిక ప్రగతి…

ప్రచురణార్థం

రుణాలతోనే ఆర్థిక ప్రగతి…

మహబూబాబాద్ అక్టోబర్ 26.

బ్యాంకుల రుణాలు తోనూ నిరుపేదల ఆర్థిక ప్రగతి పెంపొందుతుందని జిల్లా కలెక్టర్ శశాంక స్పష్టం చేశారు.

మంగళవారం పట్టణంలోని నందన గార్డెన్స్ లో లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో 14 బ్యాంకులు చే చేపట్టిన సుమారు యాభై ఆరు కోట్ల రుణ పంపిణీ విస్తరణ మహోత్సవాన్ని కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ రుణ ప్రగతి లక్ష్యాలను సాధించినప్పుడే నిరుపేదలు ఆర్థికంగా బలోపేతం అవుతారన్నారు.

జిల్లాలో 665 గ్రామైక్య సంఘాలలో పన్నెండు వేల ఐదు వందల మంది స్వయం సహాయక సంఘాల మహిళలు ఉన్నారని రుణాలను మంజూరు చేసి ప్రోత్సహించ గలిగితే ఆర్థికంగా బలోపేతం అవుతారని తెలిపారు.

గూడూరు మండలంలో స్వయం సహాయక సంఘాల మహిళలు అన్నపూర్ణ హోమ్ ఫుడ్స్ స్థాపించడం గర్వకారణమన్నారు మహిళలు కుటుంబ పరంగానే కాక వ్యాపార రంగంలో అడిగిడుతూ మార్కెట్ను శాసించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

ఇదే స్ఫూర్తితో మరికొంతమంది రుణాలను పొంది ఆసక్తి ఉన్న వ్యాపార రంగాలు నెలకొల్పు కుంటూ ఆర్థికంగా బలోపేతం కావాలన్నారు.

బయ్యారం మండలంలో షిరిడి సాయి జ్ఞాన సరస్వతి పేరుతో మహిళలు వస్త్ర విక్రయాలు చికెన్ షాపులు నెలకొల్పి అభివృద్ధి పథంలో దూసుకు వెళుతుండటం అభినందించదగినదన్నారు.

పట్టణంలోని ఎన్జీవోస్ కాలనీ కి చెందిన యశ్వంత్ ఉన్నత విద్య చదివి స్వయం ఉపాధి ఎంచుకొని జూట్ బ్యాగుల తయారీతో అభివృద్ధి పథంలో దూసుకు వెళ్తున్న యువ వ్యాపారవేత్తను కలెక్టర్ ప్రశంసించారు.

యువత ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధి పై దృష్టి పెట్టి బ్యాంకుల సహకారంతో ఆర్థిక ప్రగతి సాధించాలని అన్నారు.

రుణ విస్తరణ మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని రూ 55.44 కోట్ల రుణాలు పంపిణీ చేస్తున్నందున లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

అంతకుముందు కలెక్టర్ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశు వైద్యం కొరకు ఏర్పాటు చేసిన మొబైల్ వాహనాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో బ్యాంక్ అధికారులు వివేక్ జైస్వాల్ ఎస్ కే అలీ ఉద్దీన్ హారేరామ్ నిరంజన్ చందర్రావు చిన్నారావు అశోక్ లీడ్ బ్యాంక్ మేనేజర్ రాఘవేంద్ర రావు డిఆర్డిఎ పిడి సన్యాసయ్య జిల్లా అధికారులు బాలరాజు శ్రీనివాస్ దిలీప్ కుమార్ డి పి ఎం నళిని నారాయణ బ్యాంక్ సిబ్బంది స్వయం సహాయక సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు.
—————————————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post