రుణ ప్రగతి లక్ష్యాలను సాధించాలి::జిల్లా కలెక్టర్ కె.శశాంక

రుణ ప్రగతి లక్ష్యాలను సాధించాలి::జిల్లా కలెక్టర్ కె.శశాంక

ప్రచురణార్థం

మహబూబాబాద్ మే 30.

నిర్దేశించుకున్న రుణ ప్రగతి లక్ష్యాలను నిర్ణీత వ్యవధిలో సాధించేందుకు బ్యాంకర్లు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

మంగళవారం ఐడిఓసి లోని కలెక్టర్ సమావేశం మందిరంలో లీడ్ బ్యాంకు అధికారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమన్వయ సమీక్ష కమిటీ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… పంట రుణాలు లక్ష్యాల సాధింపులో 95 శాతం ప్రగతి సాధించడం పట్ల అభినందిస్తూ రుణాలను సాధ్యమైనంత మేరకు రైతులకు ఆయా సీజన్లలో సకాలంలో అందిస్తే ప్రయోజనకరంగా ఉంటాయన్నారు.

జిల్లాలో కోళ్ల పరిశ్రమ పాడి పరిశ్రమలను నెలకొల్పుకునేందుకు అవకాశాలు ఉన్నందున బ్యాంకు అధికారులు రుణాల మంజూరు లో కృషి చేయాలన్నారు.

ప్రధానమంత్రి ఉపాధి కల్పనా పథకం కింద జిల్లాలో 30 యూనిట్ల సాధింపు లక్ష్యాల అధిగమించి 31 యూనిట్ల ప్రగతి సాధించడం అభినందనీయమని 100 యూనిట్లకు ప్రణాళిక రూపొందించుకొని రుణాలు మంజూరు చేసే విధంగా బ్యాంక్ అధికారులు సంబంధిత జిల్లా అధికారులతో సమన్వయంతో సాధించాలన్నారు.

స్వయం సహాయక సంఘాల ఆర్థిక ప్రగతి పెంచేందుకుగాను నిర్దేశించుకున్న 500 కోట్ల బ్యాంకి లింకేజీ లో 417 కోట్లు లక్ష్యాలను సాధించి రాష్ట్రస్థాయిలో 83%తో అవార్డుకు ఎంపికవటం ఆదర్శంగా నిలిచారన్నారు.

జిల్లాలో ధాన్యం నిలువకు రైస్ మిల్స్ గోదాములు మిర్చి పత్తి నిల్వకు కోల్డ్ స్టోరేజీలు కొరత ఉందని ఔత్సాహికులను ప్రోత్సహించి జిల్లా లో కోల్డ్ స్టోరేజీలు గోదాములు నిర్మించేందుకు రుణాలు మంజూరు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

జిల్లాలో పోడు పట్టాల పంపిణీ త్వరలోనే చేపట్టబోతున్నామని గతంలో 8 వేలకు పైగా మాత్రమే ఉండేవని ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల 24 వేల మంది అటవీ హక్కు పత్రాలు పొందుతున్నందున వ్యవసాయ సేద్యంలో అధిక మొత్తంలో రుణాలు ఇచ్చి రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ కోరారు.

ఈ సమన్వయ సమీక్ష సమావేశంలో నాబార్డ్ ఏజీఎం చంద్రశేఖర్ ,ఆర్బిఐ ఏజీఎం వైభవ్ వ్యాస్, ఎస్బిఐ ఆర్ఎం అబ్దుల్ రహీం, ఏపీజీవీబీ ఆర్ఎం శ్రీధర్ రెడ్డి , లీడ్ బ్యాంకు మేనేజర్ సత్యనారాయణమూర్తి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి సూర్యనారాయణ, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి సుధాకర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలరాజు, పరిశ్రమల శాఖ అధికారి సత్యనారాయణ, మెప్మా జిల్లా మిషన్ కోఆర్డినేటర్ విజయ తదితరులు పాల్గొన్నారు.

Share This Post