రుణ లక్ష్యాలను బ్యాంకర్లు సకాలంలో సాధించాలి :: జిల్లా కలెక్టర్ జి.రవి

పత్రికాప్రకటన..2

రుణ లక్ష్యాలను బ్యాంకర్లు సకాలంలో సాధించాలి :: జిల్లా కలెక్టర్ జి.రవి

తేదిః 23-09-2021
రుణ లక్ష్యాలను బ్యాంకర్లు సకాలంలో సాధించాలి :: జిల్లా కలెక్టర్ జి.రవి
జగిత్యాల, సెప్టెంబర్ 23:- ప్రభుత్వ అందించే రుణ లక్ష్యాలను బ్యాంకర్లు సకాలంలో సాధించి, రుణ లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు పూర్తి స్థాయిలో సహకరించాలని , జిల్లా కలెక్టర్ జి. రవి తెలిపారు. రైతుల పంట రుణాలు, ఎస్.హెచ్.జి. ,ఎస్సి ఎస్టీ కార్పోరేషన్ ల రుణాలు, ఆర్థిక అక్షరాస్యత, ఇతర అంశాల పై గురువారం డి.సి.సి, డి.ఎల్.ఆర్.సి బ్యాంకర్ల త్రైమాసిక పురోగతి పై సమీక్షా సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, దానికి సంబంధించిన పురొగతి తదితర అంశాల ను లీడ్ బ్యాంక్ మేనేజర్ వివరించారు. ప్రజలు ఆర్థికంగా ఎదిగేందకు అవసరమైన సహకారం బ్యాంకింగ్ రంగం అందించాలని, అభివృద్ది కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని కలెక్టర్ పేర్కొన్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించి 2021 వానాకాలం పంటకు గాను జిల్లాలోని 99518 రైతులకు రూ.1260 కోట్ల రుణం మంజూరి చేయడం లక్ష్యం కాగా జూన్ చివరి వరకు 15306 మంది రైతులకు రూ.202.56 కోట్లు రుణాలు రైతులకు అందించామని అధికారులు తెలిపారు. రైతులకు రుణ లక్ష్యాలు చేరుకోవడంలో మరింత పురొగతి సాధించాల్సి ఉందని, రైతులు తమ రుణాలను రెన్యూవల్ చేసుకునే అంశం పై వారికి అవగాహన కల్పించాలని తెలిపారు. రైతులకు రుణాలు మంజూరు లక్ష్యాల చేరుకోకపోవడం పై బ్యాంకుల వారిగా కలెక్టర్ సమీక్షించారు. మహిళలు ఆర్థికంగా ఉన్నతస్థాయికి చేరుకునేలా ప్రభుత్వం అందించే స్వశక్తి సంఘాల రుణాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అన్నారు. మన జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూన్ చివరి వరకు 1023 స్వశక్తి సంఘాలకు రూ.47.16 కోట్లు రుణాలు అందించామని, మెప్మా కింద స్వశక్తి సంఘాలకు రూ.9.72 కోట్ల రుణాలు అందించామని అధికారులు తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో మహిళా సంఘాలకు రుణ లక్ష్యం చేరుకోవాలని, ప్రస్తుత సంవత్సరం 12788 సంఘాలకు రూ.446.76 కోట్ల రుణం అందించడం లక్ష్యంగా ఉందని, దీని సాధన కోసం ప్రణాళికాబ్దంగా పనిచేయాలని , ప్రతి మాసం లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ అన్నారు. ఎస్సి కార్పోరేషన్ రుణాలపై సమీక్షిస్తూ 2017-18 సంవత్సరానికి సంబంధించి 679 యూనిట్ల సబ్సిడి విడుదల అయినప్పటికి 620 మాత్రమే గ్రౌండ్ అయ్యాయని, 2018-19 సంవత్సరంలో 155 యూనిట్లు మంజూరైతే 122 మాత్రమే గ్రౌండ్ అయ్యాయని కలెక్టర్ అన్నారు. ట్రైకార్ ద్వారా 2017-18 సం చెందినవి 3 యూనిట్లు పెండింగులో ఉన్నవని మరియు 2020-21వి 49 యూనిట్లు గాను 60 లక్షల సబ్సిడీ మొత్తం రానున్నట్లు తెలిపారు వీటిని తోరగా గ్రౌండింగ్ పూర్తి చేయాలని , అదేవిధంగా ప్రభుత్వం సబ్సీడి విడుదల చేసిన వారికి రుణాలు మంజూరు చేసి యూనిట్లను గ్రౌండ్ చేసేలా బ్యాంకర్లు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాకు ఎస్సి యాక్షన్ ప్లాన్ కింద 2020-21 సంవత్సరంలో రూ.48.10 కోట్ల సబ్సీడితో 1890 యూనిట్ల మంజూరయ్యాయని తెలిపారు. యువతకు ఉపాధి అందించే విషయంలో అధికారులు చొరవ చుపాలని కలెక్టర్ బ్యాంకర్లకు సూచించారు. యువతకు స్వయం ఉపాధి పెంపొందించడానికి ప్రధానమంత్రి ఉపాథి కల్పన పథకం కింద 123 ప్రాజేక్టులు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 23 ప్రాజేక్టులు మంజూరు చేసామని, పెండింగ్ లో ఉన్న వాటిని పరిశీలించి త్వరగా మంజూరు చేయాలని తెలిపారు. జిల్లాలో డిజీటల్ పేమెంట్స్ అధికంగా వుండేలా చుడాలని కలెక్టర్ అన్నారు. జిల్లాలో ఆర్థిక అక్షరాస్యత పెంపొందించడానికి బ్యాంకులు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఉన్న 121 బ్యాంకు బ్రాంచీలు ప్రతి మాసం తప్పనిసరిగా 1 ఆర్థిక అక్షరాస్యత పెంపొందించే ప్రత్యేక అవగాహన క్యాంపు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఆత్మనిర్భర్ భారత్ కింద జిల్లాలో చిన్న మరియు సూక్ష్మ పరిశ్రమలకు సహకారం అందించాలని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 19853 మందికి 583.54 కోట్ల రుణం అందించడం లక్ష్యం కాగా ఇప్పటి వరకు 957 మందికి 45.83 కోట్ల రుణం అందించామని తెలిపారు. జిల్లాలో 11558 మంది వీధి వ్యాపారులకు రుణాలు మంజూరు చేసామని వాటిలో 10897 మందికి నగదు అందించామని, మిగిలిన వీధి వ్యాపారులకు సైతం రుణం మంజూరు చేసి నగదు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో బ్యాంకుల క్రెడిట్ డెబిట్ సిడి నిష్పత్తి 86శాతం ఉందని, గత సంవత్సరం కంటే 9 శాతం అధికంగా ఉందని, దీనికి కృషి చేసిన అధికారులకు , సిబ్బందికి కలెక్టర్ అభినందనలు తెలిపారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ, కోరుట్ల రెవెన్యూ డివిజన్ అధికారి వినోద్ కుమార్, లీడ్ బ్యాంకు మేనేజరు వెంకట్ రెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి వినోద్ కుమార్, ఈడి.ఎస్సి కార్పొరేషన్ లక్ష్మీనారాయణ, ఆర్బీఐ ఎజిఎం అనిల్ కుమార్, డిడిఎం నాబార్డు మనోహర్ రెడ్డి, వివిధ బ్యాంకు కంట్రోలర్లు, మేనేజర్లు , సంబంధిత అధికారులు, తదితరులు ఈ సమీక్షలో పాల్గోన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి, జగిత్యాలచే జారీచేయనైనది

Share This Post