రూపాంతరం చెందిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ను అరికట్టడానికి వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయడం చాలా ముఖ్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు జిల్లా కలెక్టర్లను సూచించారు

రూపాంతరం చెందిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ను అరికట్టడానికి వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయడం చాలా ముఖ్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు జిల్లా కలెక్టర్లను సూచించారు.  బుధవారం మధ్యాహ్నం రాష్ట్ర మున్సిపల్, ఐ.టి శాఖ మంత్రి కే.టి. రామారావు, రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వి, ఇతర ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్ పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఒకవేళ కరోనా వచ్చిన ఎటువంటి ప్రాణి జరుగకుండా అన్ని ముందస్తు  జాగ్రతలతో సిద్ధంగా ఉండాలని తెలిపారు.  దీనికొఱకు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకొని ఉండటం, తప్పంకుండా మాస్క్ ధరించడం, కోవిడ్ నిబంధనలు పాటించడం ప్రధానమన్నారు.  జిల్లాల్లో ఎక్కడైతే తక్కువ శాతం వ్యాక్సిన్ అయ్యినదో అల్లాంటి ప్రాంతాల పై పి.హెచ్.సి ల వారిగ ప్రత్యేక దృష్టి సారించి డిసెంబర్ 31 లోగా వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు.  మొదటి డోస్ వంద శాతం పూర్తి చేయడంతో పాటు రెండవ డోస్ సైతం ముమ్మరం చేసి డిసెంబర్ 31 లోగా వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు.  ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ ఒక టీమ్ వర్క్ చేసి వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని సూచించారు.  అదేవిధంగా ఆయా జిల్లాల్లో చేపడుతున్న మెడికల్ కళాశాల నిర్మాణ పనులు, ప్రభుత్వ ఆసుపత్రి పడకల పెంపు వంటి వాటి పై దృష్టి పెట్టి వేగవంతం చేయాలన్నారు.  రేడియాలజి, తెలంగాణ డయజ్ఞస్టిక్ హబ్, ఆర్.టి.పి.సి.ఆర్. సెంటర్లకు తగిన స్థలం గుర్తించి కేటాయించాల్సిందిగా  కలెక్టర్లను కోరారు.  గ్రామాల్లో టామ్ టామ్ చేయించి వ్యాక్సినేషన్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్, ఐ.టి శాఖ మంత్రి కె. తారక రామారావు మాట్లాడుతూ ఇప్పటి వరకు వచ్చిన కరోనా మొదటి రెండవ విడతల సమస్యలు చూశామని, ఎటువంటి సమస్యలను ఎదుర్కొన్నామో వాటిని పునరావృతం కాకుండా సర్వసన్నద్ధంగా ఉండాలని సూచించారు.  ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏంచేస్తుంది, జిల్లా యంత్రాంగం ఏంచేస్తుంది రోజువారీ విషయాలు స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించి తగిన సహకారం తీసుకోవాలని తెలిపారు.  సోషల్ మీడియా, బయట అనేక దుష్ప్రచారాలు వచ్చి ప్రజలు భయబ్రాంతులకు గురి ఆవుతుంటారని వీటిని ఎప్పటికప్పుడు నిరోధిస్తూ వాస్తవాలను ప్రజలకు తెలియజేసే విధంగా చూడాలని కలెక్టర్లకు సూచించారు.  ఇందుకోసం కలెక్టర్లు మీడియాతో మాట్లాడటం, సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్లను సూచించారు.  ప్రజలకు సరియైన సమాచారం ఇచ్చే బాధ్యతలు కలెక్టర్లు తీసుకోవాలన్నారు.  వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేసేందుకు జిల్లాలో మండలాలు, పి.హెచ్.సి లు, గ్రామాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ పెట్టాలని వంద శాతం పూర్తి చేసుకుంటున్నట్లు ప్రకటించే గ్రామాలు, పి.హెచ్.సి ల ను ప్రచారం చేయాలని సూచించారు.

రాష్ట్ర ఉన్నత విద్యా శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రతి పాఠశాలో పని చేసే టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకొని ఉండాలని ఆదేశించారు.  కళాశాలల్లో 18 సంవత్సరాలు నిండిన ప్రతి విద్యార్థి మొదటి, రెండవ డోస్ పూర్తి అయ్యే విధంగా కళాశాలల్లో ప్రత్యేక క్యాంపెన్లు ఏర్పాటు చేయాలని సూచించారు.  గురుకుల, హాస్టల్ విద్యార్థుల విషయంలో వార్ధన్లు, ఉపాధ్యాయులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.  అనవసరమైన వదంతులు నమ్మకుండా నివారించాలని తెలియజేసారు.

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ వ్యాక్సినేషన్  జిల్లా పర్సెంటేజ్ చూడకుండా ఎక్కడైతే తక్కువ వ్యాక్సినేషన్ జరిగిందో అలాంటి ప్రాంతాల పై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి వంద శాతం వ్యాక్సినేష పూర్తి అయ్యే విధంగా చూడాలని తెలియజేసారు.

మహబూబ్ నగర్ కలెక్టరేట్ నుండి రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, మహబూబ్ నగర్ కలెక్టర్ వెంకట్రావు తో కలిసి వీడియో కాన్ఫెరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి  మాట్లాడుతూ  మొదటి డోస్ వంద శాతం పోర్తి చేయడం తో పాటు రెండవ డోస్ ను నిర్ణిత సమయంలో వందశాతం పూర్తి చేసేందుకు తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

Share This Post