రూమ్ టు రీడ్ ఇండియా ట్రస్ట్ ఆధ్వర్యంలో బాలిక విద్యా కార్యక్రమం లో భాగంగా ఈరోజు నారాయణపేట జిల్లా కేంద్రం నైపుణ్య శిక్షణ సెంటర్ లో అధికారులతో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది

రూమ్ టు రీడ్ ఇండియ ట్రస్ట్ ఆధ్వర్యంలో బాలిక విద్యా కార్యక్రమం లో భాగంగా ఈరోజు నారాయణపేట  జిల్లా కేంద్రం నైపుణ్య శిక్షణ సెంటర్ లో అధికారులతో అవగాహన సదస్సు నిర్వహించడం  జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  జిల్లా కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ  బాలిక విద్య  కోసం ఎలాంటి సహాయ సహకారం కావాలన్నా అందిస్తామని పేర్కొన్నారు. అలాగే కార్యక్రమం లో బాలికలు ప్రదర్శించిన బాల్యవివాహాల అనే అంశం పై చేసిన నాటికను తిలకించి బాలికలకు అభినందించారు. ఎవరు కూడా బాల్యవివహానికి ప్రోతహించారాదని ఎవరైనా బాల్యవివాహాలు చేస్తునట్టు తెలిస్తే చైల్డ్ లైన్ 1098 టోల్ ఫ్రీ కు ఫోన్ చేస్తే వెంటనే అధికారులు చేరుకొని బాల్యవివాహాలను జరగకుండా చుస్తారన్నారు.   బాలిక విద్య కోసం  ఉపయోగించే మెటీరియల్ గ్యాలరీ ని పరిశీలించరు.

ఈ కార్యక్రమం లో DWO వేణుగోపాల్, డాక్టర్ శైలజ, సఖి సెంటర్ సిబ్బంద్ది, చైల్డ్ లైన్, CWC సిబ్బంద్ది తదితరులు పాల్గొన్నారు.

Share This Post