రూరల్ ఎలెక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఢిల్లీ వారు కోటి నలబై ఐదు లక్షల (1 .45 లక్షల ) నిధుల ద్వారా హనుమకొండ రెడ్ క్రాస్ సొసైటీ రక్త కేంద్రమును అత్యాధునిక పరచడానికి కొనుగోలు చేసిన పరికరాలు ప్రారంభం

రూరల్ ఎలెక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఢిల్లీ వారు కోటి నలబై ఐదు లక్షల (1 .45  లక్షల ) నిధుల ద్వారా హనుమకొండ రెడ్ క్రాస్ సొసైటీ రక్త కేంద్రమును అత్యాధునిక పరచడానికి కొనుగోలు చేసిన  పరికరాలు ప్రారంభం

దయతో పత్రికా ప్రచురణార్థం.. 06-06-2022

– రూరల్ ఎలెక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఢిల్లీ వారు కోటి నలబై ఐదు లక్షల (1 .45 లక్షల ) నిధుల ద్వారా హనుమకొండ రెడ్ క్రాస్ సొసైటీ రక్త కేంద్రమును అత్యాధునిక పరచడానికి కొనుగోలు చేసిన పరికరాలు ప్రారంభం –

– ఇటీవల ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సహకారం తో అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్సు ప్రారంభం –

రెడ్ క్రాస్ సొసైటీ, సుబేదారి : రెడ్ క్రాస్ పాలకవర్గ సభ్యుల అభ్యర్థన మేరకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన రూరల్ ఎలెక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఢిల్లీ వారు హనుమకొండ రెడ్ క్రాస్ సొసైటీ రక్త కేంద్రమును అత్యాధునిక పరచడానికి పరికరాలు కొనుగోలుకు కోటి నలబై ఐదు లక్షల (1 .45 లక్షల ) నిధులను మంజూరు చేశారు. ఈ నిధుల ద్వారా కొనుగోలు చేసిన పరికరాలను ప్రారంభోత్సవాన్ని సోమవారం రోజున తెలంగాణ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్: శ్రీ అజయ్ మిశ్రా (రిటైర్డ్ కలెక్టర్), హనుమకొండ జిల్లా కలెక్టర్ మరియు రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు : శ్రీ రాజీవ్ గాంధీ హన్మంతు చేతులమీదుగా ప్రారంభించినారు.

ముందుగా REC ప్రతినిధులకు పాలకవర్గం స్వాగతం పలికి రెడ్ క్రాస్ ఆవరణ లో ఉన్న రెడ్ క్రాస్ జెనరిక్ మందుల షాప్, టైలరింగ్, జూనియర్ మరియు యూత్ రెడ్ క్రాస్, డిసాస్టర్ సెల్ గురుంచి వివరించారు. అనంతరం తలసీమియా సెంటర్ ను సందర్శించి పిల్లలతో మాట్లాడి వారి బాగోగులు తెలుసుకున్నారు. తలసీమియా వ్యాధిగ్రస్తులకు రెడ్ క్రాస్ అందిస్తున్న సేవలకు పాలకవర్గాన్ని అభినందించారు. పిదప రెడ్ క్రాస్ లో నడుస్తున్న రక్త కేంద్రమును సందర్శించి వారి సంస్థ ద్వారా అందించిన పరికరాలను పరిశీలించారు.

సీనియర్ చీఫ్ ప్రోగ్రాం మేనేజర్ REC RO హైదరాబాద్: యన్. వెంకటేశన్ మాట్లాడుతూ రెడ్ క్రాస్ సొసైటీ హనుమకొండ ద్వారా స్వచ్చంద రక్తదాతల ద్వారా సేకరించిన రక్తాన్ని తలసీమియా బాధితులకు, ప్రమాద బాధితులకు, గర్భిణులకు అందించే రక్త కేంద్రమునకు అత్యాధునిక పరచడానికి అవసరమైన పరికరాలు ఆర్ ఈ సి ద్వారా సమకూర్చడం సంతోషంగా ఉందని, ఈ సందర్బంగా పాలక వర్గం చేస్తున్న సేవ కార్యక్రమాలకు ప్రత్యేకంగా అభినందించారు.

హనుమకొండ కలెక్టర్ మాట్లాడుతూ తొలుత REC అధికారులు రక్త కేంద్రమును అత్యాధునిక పరచడానికి పరికరాలు కొనుగోలుకు కోటి నలబై ఐదు లక్షల (1 .45 లక్షల ) నిధులను మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపినారు. ఇటీవలే ఐఓసీ ద్వారా అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్సు సేవలు అందుబాటులోకి రావడం జరిగింది అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదట హనుమకొండ జిల్లాకు REC ద్వారా 1 .45 లక్షల నిధుల మంజూరుకు కృషిచేసిన పాలకవర్గాన్ని ప్రత్యేకంగా అబినందించినారు. ఇంకా CSR నిధులు హనుమకొండ రెడ్ క్రాస్ సొసైటీ వచ్చేవిదంగా సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.

తెలంగాణ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్: శ్రీ అజయ్ మిశ్రా ( ఐఏఎస్ రిటైర్డ్) మాట్లాడుతూ తొలుత REC అధికార్లకు (1 .45 లక్షల ) నిధులను మంజూరు చేసినందుకు అభినందనలు తెలిపినారు. హనుమకొండ రెడ్ క్రాస్ సొసైటీ కి సహాయ సహకారాలు అందించిన కలెక్టర్ గారికి అభినందనలు తెలిపినారు. నేను గత రెండు నెలల్లో రెండు సార్లు హనుమకొండ రెడ్ క్రాస్ కు వచ్చి ప్రారంబోత్సవాలలో పాల్గొనడం జరిగింది. తెలంగాణలోనే హనుమకొండ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ పాలకవర్గం చాల చురుకుగా పనిచేస్తుందని ఈ సందర్బంగా పాలకవర్గాన్ని అభినందించడం జరిగింది. ముందు ముందు కూడా నా సహకారం ఎల్లవేళలా ఉంటుందని తెలియచేసినారు.

హనుమకొండ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ : డాక్టర్ పి. విజయచందర్ రెడ్డి మాట్లాడుతూ REC అధికారులకు రెడ్ క్రాస్ సొసైటీ హనుమకొండ పాలకవర్గ సభ్యుల పక్షాన కృతజ్ఞతలు తెలియపరిచారు. ఈ అత్యాధునిక పరికరాల ద్వారా స్వచ్ఛమైన రకాన్ని అందిస్తామని తెలిపారు.

అనంతరం స్టేట్ రెడ్ క్రాస్ చైర్మన్, కలెక్టర్, REC అధికారాలను, పరికరాలు సమకూర్చిన ఏజెన్సీ ప్రతినిధులను శాలువా, షీల్డ్ తో పాలకవర్గం సన్మానించారు. ఈదేవిదంగా రెడ్ క్రాస్ సొసైటీ CSR కమిటి చైర్మన్ మరియు జిల్లా పాలకవర్గ సభ్యులు : పెద్ది వెంకటనారాయణ గౌడ్, రాష్ట్ర పాలకవర్గసభ్యులు & CSR కమిటి మెంబెర్: ఈ.వి. శ్రీనివాస్ రావు, CSR కమిటి మెంబెర్ మరియు జిల్లా పాలకవర్గ సభ్యులు : బొమ్మినేని పాపి రెడ్డి, హనుమకొండ DM &HO : బి. సాంబశివరావు లను కలెక్టర్, తెలంగాణ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ గార్లు శాలువా, షీల్డ్ తో సన్మానించారు.

ఈ కార్యక్రమం లో వైస్ చైర్మన్: డాక్టర్ కె. సుధాకర్ రెడ్డి, జిల్లా పాలకవర్గ సభ్యులు : పొట్లపల్లి శ్రీనివాస్ రావు, మేనేజర్ (టెక్)REC, RO హైదరాబాద్: టి. ప్రవీణ్, పరికరాల ఏజెన్సీ ప్రతినిధులు : జి. వెంకట్, వేణుగోపాల్ మరియు రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post