రూర్బన్‌ పెండింగ్‌ పనులను సత్వరమే పూర్తి చేయాలి, పనులు జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్లును బ్లాక్ లిస్ట్ లో ఉంచండి – జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్

పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ పరిధిలో నిర్మిస్తున్న పెండింగ్‌ పనులు సత్వరమే పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ మను చౌదరి తో కలిసి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ పరిధిలో నిర్మిస్తున్న, రూర్బన్‌, రెండు పడకల గదులు, ఎంపీ ల్యాండ్ నిధుల నిర్మాణ పనులపై జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ సమీక్షించారు.
పెద్దకొత్తపల్లి మండలలో రూర్బన్ పథకంలో భాగంగా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ పరిధిలో 153 పనులను జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
పనుల నిర్మాణంలో అలసత్వం వహిస్తున్న కాంట్రాక్టర్లుకు వెంటనే నోటీసులు జారీ చేసి బ్లాక్ లిస్టులో ఉంచాలని ఆదేశించారు.
నియమ నిబంధనల ప్రకారం అనుకున్న గడువుకు నిర్మాణ పనులు పూర్తి చేయని కారణంగా కాంట్రాక్టర్ లపై చర్యలు తీసుకోవాలన్నారు.
రూర్బన్ పథకం ద్వారా 6.12 కోట్ల రూపాయలతో పిఆర్ ద్వారా చేపడుతున్న 153 పనులకు గాను 102 పనులు ఇప్పటికే పూర్తికాగా 35 పనులు పురోగతిలో ఉండగా 16 పనులు ఇంకా గ్రౌండింగ్ చేయని కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
పండ్ల నిర్మాణంలో జాప్యం వహించకుండా పూర్తి చేయాలని ఆదేశించారు.
జిల్లాలో వివిధ ప్రాంతాలలో నిర్మిస్తున్న 4,706 డబల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలకు కావలసిన నిధుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
మున్సిపాలిటీ పరిధిలో నిర్మిస్తున్న డబల్ బెడ్ రూమ్ ఇండ్లకు మున్సిపల్ నిధుల నుండి అందించేందుకు కృషి చేస్తానని నిర్మాణ పనులను సత్వరమే పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఇప్పటివరకు 755 డబల్ బెడ్ రూమ్ ఇండ్లు చివరి నిర్మాణ దశల్లో ఉన్నాయని అధికారులు వివరించారు.
17 వ లోక్ సభ, ఎంపీ ల్యాండ్ నిధులతో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
2.87కోట్ల రూపాయలతో చేపడుతున్న 78 అభివృద్ధి పనుల స్థితిగతులపై సమీక్షించారు.
పిఎంజివై నిధుల నుండి నిర్మిస్తున్న రోడ్ల పనులను సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు.
అదేవిధంగా వైకుంఠ దామాల నిర్మాణ పనుల నమోదులో జాప్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రతి ఈఏ పరిధిలో వైకుంఠ దామాల పనుల్లో 90% పనుల పేమెంట్ కు ఆన్లైన్ నమోదు చేయకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఈఈ దామోదరరావు, డీఈ దుర్గాప్రసాద్, ఇతర డీఈలు ఎఈలు తదితరులు పాల్గొన్నారు.

Share This Post