రూర్బన్ నిధులను సద్వినియోగం చేయాలి – జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

పెద్దకొత్తపల్లి మండలంలో 30 కోట్ల రూపాయలతో కొనసాగుతున్న రూర్బన్ పెండింగ్ పనులు సత్వరమే పూర్తి చేసుకోవాలని, నిధులను సద్వినియోగం చేయాలని జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ అటవి, పంచాయతీరాజ్, ఈడబ్ల్యూఐడిసి, పర్యాటక, మార్కెటింగ్ విద్యా శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం నాడు కలెక్టర్, అదనపు కలెక్టర్ మను చౌదరి తో కలిసి కలెక్టరేట్ సమావేశ మందిరంలో రూర్బన్ పనులను సమీక్షిస్తూ, పెద్దకొత్తపల్లి మండల పరిధిలో వివిధ గ్రామాల్లో రూర్బన్ ద్వారా చేపట్టిన 13 శాఖల ద్వారా కొనసాగుతున్న వివిధ రకాల నిర్మాణ, అభివృద్ధి పనులను సకాలంలో పనులు పూర్తి చేసి, నిధులను సద్వినియోగం చేయాలని కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
అటవీ శాఖ ద్వారా పెద్దకొత్తపల్లి లో కోటి రూపాయల ద్వారా, నాయినిపల్లి లో 15 లక్షల రూపాయలతో ఏర్పాటు చేయనున్న పార్కుల అభివృద్ధి పనులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.
మండల కేంద్రం పెద్దకొత్తపల్లితో పాటు కల్వకోలు, ఎన్నిచర్ల, సాతాపూర్ లలో ఏర్పాటు చేయనున్న మినీ స్టేడియలు తో పాటు 9 కోట్ల 12 లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి కావాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు.
తెలంగాణ ఈడబ్ల్యూఐడిసి ఇంజనీరింగ్ విభాగం ద్వారా నిర్మించనున్న మ్యాంగో ప్రాసెసింగ్ కోల్డ్ స్టోరేజ్ పనులు 4 కోట్ల రూపాయలతో పెద్దకర్పాముల లో నిర్మిస్తున్న పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.
అదేవిధంగా ఫిష్ ప్రాసెసింగ్ కేంద్రానికి కావలసిన భూమిని సేకరించి వెంటనే నిర్మాణానికి అందజేయాలని పెద్దకొత్తపల్లి తాహసిల్దార్ను ఆదేశించారు.
పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 2 కోట్ల రూపాయలతో జొన్నలగడ్డ రిజర్వాయర్ వద్ద ఏర్పాటు చేయనున్న బోటింగ్ మరియు పార్క్ ఏర్పాటు పనులను వెంటనే పూర్తి చేయాలని వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.
13 శాఖలకు సంబంధించిన వివిధ పనులను సకాలంలో పూర్తి చేసి పూర్వం నిధులను సద్వినియోగం చేయాలి అధికారులను ఆదేశించారు.
పాఠశాలలు, అంగన్వాడీలు నీటి వసతి కి కావలసిన నిర్మాణ పనులపై విద్యాశాఖ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో చర్చించారు.
రూర్బన్ పనులకు సకాలంలో నిధులు మంజూరు అయ్యేలా చూడాలని డిఆర్డిఏ పిడి ని ఆదేశించారు.
ఈ సమీక్షలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మను చౌదరి, పిడి డిఆర్డిఎ నర్సింగ్ రావు, అటవీశాఖాధికారి కృష్ణ గౌడ్, డిఈవో గోవిందరాజులు, ఆర్డబ్ల్యూఎస్ శ్రీధర్, రూర్బన్ ప్రాజెక్టు జిల్లా మేనేజర్ మంజుల, వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post