రూర్బన్ పథకం లో చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ రాజర్షి షా సంబంధిత అధికారులకు ఆదేశించారు.

పత్రిక ప్రకటన
సంగారెడ్డి, ఆగస్టు 26:–
రూర్బన్ పథకం లో చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ రాజర్షి షా సంబంధిత అధికారులకు ఆదేశించారు.

గురువారం రాజర్షి షా నారాయణ్ ఖేడ్ నియోజకవర్గం లోని మనూర్ మండలం లోని తిమ్మాపూర్ గ్రామ పంచాయతీ లో అభివృద్ది చేస్తున్న బృహత్ పల్లె ప్రకృతి వనం పనులను పరిశీలించారు.

కంగ్టి మండలము ముకుంద్ నాయక్ తండా లో బృహత్ పల్లె ప్రకృతి వనం కొరకు కేటాయించిన స్థలాన్ని మండల తహశీల్దార్ తో కలిసి పరిశీలించారు. కేటాయించిన భూమి సరిహద్దు లను త్వరితగతిన గుర్తించి గ్రామ పంచాయతీకి అందజేయాలని ఆయన ఆదేశించారు.

అనంతరం నారాయన్ ఖేడ్ మండలము లో రుర్బాన్ పథకం లో చేపడుతున్న పనులు, చాప్టా( కే) గ్రామ పంచాయతీ లో నిర్మిస్తున్న పశువుల దవాఖాన( సబ్ సెంటర్) , నారాయణఖేడ్ లో జరుగుతున్న మినీ సైన్స్ ముజియం మరియు ల్యాబ్, ఆక్సిజన్ పార్క్, పశువుల దవాఖాన మరియు ట్రైనింగ్ సెంటర్ పనులను ఆయన పరిశీలించారు.

ఈ కార్యక్రమములో డి ఆర్ డి ఓ శ్రీనివాస రావు, జెడ్పీ సీఈవో ఎల్లయ్య, ఏపీ డి రాంబాబు, మానూర్ ,కంగ్టి MPDO లు,
ఎంపీ ఓ లు,తిమ్మాపూర్ సర్పంచ్, ముకుంద నాయక్ తాండ సర్పంచ్, కాంట్రాక్టర్ హరినాథ్ రెడ్డి పాల్గొన్నారు.

నారాయణ్ ఖెడ్ మండల పరిషత్ కార్యాలయంలో నారాయణఖేడ్ నియోజక వర్గము లోని అన్ని మండలా ల ఎంపిడిలు, యం పి ఓలు , ఏ. పి. ఓ. లతో హరిత హారం, బృహత్ పల్లె ప్రకృతి వనం, మల్టీ లేయర్ అవెన్యూ ప్లాంటేషన్, శానిటేషన్, పాఠశాలలో శానిటేషన్, ఉపాధి హామీ పథకం జాబ్ కార్డ్స్ పంపిణీ సమీక్షించారు.

ఈ కార్యక్రమములో డి ఆర్ డి ఓ శ్రీనివాస రావు శ్రీ ఎల్లయ్య, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, ఏపీ డి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Share This Post