రూర్బన్ పధకం క్రింద చేపట్టి వివిధ దశలలో నిర్మాణంలో ఉన్న పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయవలసినదిగా జిల్లా కలెక్టర్ – ఎస్. హరీష్

రూర్బన్ పధకం క్రింద చేపట్టి వివిధ దశలలో నిర్మాణంలో ఉన్న పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయవలసినదిగా జిల్లా కలెక్టర్ – ఎస్. హరీష్

రూర్బన్ పధకం క్రింద చేపట్టి వివిధ దశలలో నిర్మాణంలో ఉన్న పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయవలసినదిగా జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్ పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా నిర్మాణంలో ఉన్న రైతు వేదికలను, వైకుంఠ ధామాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. శనివారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హల్ లో రూర్బన్ పధకం క్రింద చేపట్టిన వివిధ పనుల ప్రగతిని సమీక్షిస్తు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ పధకానికి నిధుల కొరత లేదని అయినా పనులు నత్తనడకన సాగుతుండడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. చేసిన పనులకు వారం రోజులలో డబ్బులు చెల్లించాలని, లెకపొతే కాంట్రాక్టర్లు కూడా పనుల పట్ల శ్రద్ధ చూపరని అన్నారు. ఈ పధకం క్రింద జిల్లాలో ఎంపిక చేసిన పాపన్నపేట్ మండలంలో పాఠశాల అదనపు గదులు, సైన్స్ ల్యాబులు, శౌచాలయాలు, ప్రహారి గోడలు, ఈ-పంచాయతీ భవనాలు, పశు సంవర్ధక, ఆరోగ్య ఉప కేంద్రాలు, వెజిటబుల్ మార్కెట్, బస్సు షెల్టర్ వంటి 436 పనులు చేపట్టి ఇంతవరకు 275 పనులు పూర్తి చేశామని అన్నారు. 108 పనులు వివిధ దశలలో ఉన్నయాని, అందులో ప్లాస్టరింగ్, ఫ్లోరింగ్, ఎలక్ట్రికల్, పెయింటింగ్ వంటి చివరిదశలో ఉన్న పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. మిగతా పనులలో కాంట్రాక్టర్లు అగ్రిమెంట్ ప్రకారం పనులు పూర్తి చేయకపోతే కాంట్రాక్టు రద్దు పరచవలసినదిగా సూచించారు. అదేవిధంగా ఇంతవరకు ప్రారంభించని 53 పనులను ప్రారంభించుటకు చర్యలు తీసుకోవలసిందిగా ఆయన అధికారులకు సూచించారు. అవసరమైతే బి.టెక్ చేసిన వి.ఆర్.ఓ. సేవలను ఉపయోగించుకోవలసినదిగా పంచాయత్ రాజ్ ఈఈ కి సూచించారు. స్వయం సహాయక సంఘాలు ఉత్పత్తి చేస్తున్న జ్యూట్ బ్యాగులకు ఆన్ లైన్ ద్వారా మార్కెటింగ్ చేయుటకు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా వారు నెలకొల్పిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా ఉత్పత్తి చేస్తున్న చిక్కీలు, విస్తరాకులు, బేకరీ, కారం పొడి వంటి వాటికి మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలన్నారు. సివిల్ వర్క్స్ పూర్తైన పాలశీతలీకరణ కేంద్రం పనులు వేగవంతం చేయవలసినదిగా విజయ డైరీ అధికారులకు సూచించారు. వైకుంఠ ధామాల వద్ద ఇంతవరకు 21 బోర్లు వేశారని, మిగిలిన 7 ప్రాంతాలలో బోర్లు వేయాలని అన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, డి.ఆర్.డి.ఓ. శ్రీనివాస్, పంచాయత్ రాజ్ ఈఈ రామచంద్ర రెడ్డి, డి.పి .ఓ. తరుణ్ కుమార్, డి.ఈ.ఓ. రమేష్ కుమార్, జిల్లా వ్యవసాయాధికారి పరశురామ్ నాయక్, లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ వేణుగోపాల్ రావు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post