రెండవ డోస్ వ్యాక్సినేషన్ వేగవంతంగా పూర్తి చేయాలి

రెండవ డోస్ వ్యాక్సినేషన్ వేగవంతంగా పూర్తి చేయాలి

ఆరోగ్య సిబ్బంది , ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ఇస్తున్న బూస్టర్ డోసు ప్రక్రియను పరిశీలించిన అద నపు కలెక్టర్…. రాజార్షి షా

జిల్లాలో కోవిడ్ రెండవ డోస్ వ్యాక్సినేషన్ వేగవంతం చేసి వంద శాతం పూర్తిచేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజార్షి షా వైద్యాధికారులకు సూచించారు.

మంగళవారం రాజార్షి అంబేద్కర్ భవన్ లో కొనసాగుతున్న టీకా ప్రక్రియను పరిశీలించారు. 60పైబడిన, ఫ్రంట్ లైన్ వారియర్స్, హెల్త్ వర్కర్స్ కు ఇస్తున్న బూస్టర్ డోస్, రెండవ డోస్ వారికి,15 -17 సంవత్స రాల వారికి అందిస్తున్న టీకా ప్రక్రియను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ మళ్లీ విజృంభిస్తున్నందున అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలో రెండవ డోస్ వ్యాక్సినేషన్ తీసుకోవడానికి అర్హులైన వారందరికీ వ్యాక్సిన్ వేసి వంద శాతం పూర్తిచేయాలన్నారు.

ఒమిక్రాన్ పై మరింత అప్రమత్తంగా ఉండాలని, రెండో డోసు, బూస్టర్ డోసు కు అర్హులైన వారందరిని చైతన్యపరిచి ఆయా డోసు టీకా తీసుకునేలా ప్రోత్సహించాలన్నారు.

ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఫ్రంట్ లైన్ వారియర్స్ తో పాటు , 60 ఏళ్లు పైబడిన వారికి (రెండవ డోసు వేసుకుని 9 మాసాలు పూర్తయిన వారికి) బూస్టర్ డోస్ అందిస్తున్నట్లు జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ శశాంక్ తెలిపారు.

అంబేద్కర్ భవన్లో ఆరు కౌంటర్లను ఏర్పాటు చేసి టీకా ఇస్తున్నామని తెలిపారు. బూస్టర్ డోస్ వారి కొరకు రెండు,15-17 టీనేజర్స్ కు రెండు, రెండో డోసు వారికి రెండు చొప్పున మొత్తం ఆరు కౌంటర్లను ఏర్పాటు చేశామని, ఎలాంటి రష్ లేకుండా, కోవిడ్ నిబంధనలను పాటిస్తూ టీకా ఇస్తున్నట్లు తెలిపారు.

టీకా కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ శశాంక్, డాక్టర్ రజిని , వైద్య సిబ్బంది, తదితరులు ఉన్నారు.

Share This Post