ప్రచురణార్థం
రెండవ రోజు ఇంటర్ పరీక్షలకు 5051 మంది విద్యార్థులు హాజరు:: ఇంటర్మీడియట్ జిల్లా విద్యాశాఖాధికారి సమ్మెట సత్యనారాయణ.
మహబూబాబాద్, మే -07:
జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, రెండవ రోజు 5051 మంది హాజరు కాగా, 606 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారని ఇంటర్మీడియట్ జిల్లా విద్యాశాఖాధికారి సమ్మెట సత్యనారాయణ నేడోక ప్రకటనలో తెలిపారు.
19 పరీక్షా కేంద్రాల్లో రెండవ రోజు జిల్లాలో జనరల్, వొకేషనల్ కలిపి 5657 మంది ఇంటర్ రెండవ సంవత్సరం విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా, 5051 మంది విద్యార్థులు హాజరయ్యారని, జిల్లాలో మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని , ప్రశాంతంగా పరీక్ష జరిగిందని, 606 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు.
జనరల్ అభ్యర్థులు 4239 మందికి గాను 3882 మంది హాజరు కాగా, 357 మంది గైర్హాజరు అయ్యారని, అలాగే వొకేషనల్ 1418 మందికి గాను 1169 మంది హాజరు కాగా 249 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యా రని తెలిపారు. మొత్తంగా రెండవ రోజు 89.3 శాతం హాజరయ్యారని తెలిపారు.
———————————————————-
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.