రెండు నెలల్లో గౌడ కమ్యూనిటీ బిల్డింగ్ నిర్మాణం పూర్తి చేయాలి: రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు.*

వచ్చే రెండు నెలల్లో గౌడ కమ్యూనిటీ బిల్డింగ్ నిర్మాణం పూర్తి చేయాలనీ
రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు అధికారులను ఆదేశించారు.

గురువారం సిద్దిపేట పురపాలక సంఘం పరిధిలోనీ రేణుకా నగర్ లో G+1 విధానంలో నిర్మాణంలో ఉన్న
గౌడ కమ్యూనిటీ బిల్డింగ్ ను మంత్రి పరిశీలించారు.

పనులు ఆలస్యంగా జరుగుతుండడం పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధ్యమైనంత త్వరగా పూర్తి అయ్యేలా చూడాలని మున్సిపల్, ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
– సిద్దిపేట పురపాలక సంఘం 11, 12 వ వార్డుల లలోని కాళ్ళ కుంట కాలనీలో రూ. 4 కోట్ల రూపాయల తో నిర్మించనున్న బిటి, సిసి రోడ్ల శంకుస్థాపన చేసిన రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు.

ఈ సందర్భంగా మంత్రి కాళ్ళ కుంట కాలనీ లోని ముస్లిం కమ్యూనిటీ హల్ ను సందర్శించారు. కమ్యూనిటీ హల్ కు ప్రవారి తో సహా ఇతర సదుపాయాల కల్పన చేపట్టాల్సిందిగా మంత్రి నీ ముస్లిం కమ్యూనిటీ ప్రజలు విజ్ఞప్తి చేయగా సానుకూలంగా స్పందించారు.

అలాగే కాలనీ మహిళలు కాలనీ కి ఆటో లు రావడం లేదని ఫలితంగా మార్కెట్, బస్ స్టాండ్ ఇతర అవసరాల కోసం పట్టణం కు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని మంత్రి దృష్టికి తెచ్చారు. స్పందించిన మంత్రి అటో లు కాలనీ కి వచ్చేలా చూస్తామని తెలిపారు.

Share This Post