పత్రికా ప్రకటన తేది: 01-12-20 22
రెండు పడకల గదుల నిర్మాణ పనులు త్వరలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు.
గురువారం దౌదర్ పల్లి సమీపంలోని డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలను గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అదనపు కలెక్టర్ అపూర్వ చౌహాన్ తో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించి మాట్లాడుతుతూ మరుగుదొడ్లు, టాయిలెట్స్ , విద్యుత్ సౌకర్యం, ఫ్లోరింగ్, కలరింగ్ , వాటర్ అన్ని సౌకర్యాలు కల్పిస్తూ అన్ని ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్, ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు. మొత్తం ఎన్ని బ్లాకులు ఉన్నాయి, ఎన్ని ఇల్లు నిర్మించారని, మ్యాప్ ద్వారా అధికారులు జిల్లా కలెక్టర్ మరియు ఎం ఎల్యే గార్లకు వివరించారు. మొదటి విడత 560 డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, 24 బ్లాక్ లు పూర్తి అయ్యాయని, ఇంకా 71 5 ఇండ్లు 30 బ్లాక్ లు అయిపోయాయని అధికారులు తెలిపారు. బ్రిక్ వర్క్ , ప్లాస్టింగ్ పనులు అవుతునాయని అన్నారు. రోడ్లు, విద్యుత్, త్రాగునీరు, సెప్టిక్ ట్యాంక్ లు ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలు పూర్తి అయ్యేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా డబల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
అనంతరం 300 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ , ఎమెల్యే ,అదనపు కలెక్టర్ పరిశీలించారు. పనులు నాణ్యవంతంగా చేయాలని సంబంధిత కాంట్రాక్టర్లను ఆదేశించారు. మిషన్ బగీరథ వాటర్ లైన్లు. విద్యుత్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఇ ఇ పి ఆర్ శివకుమార్, ఎస్సి ఇరిగేషన్ శ్రీనివాస్ , ఆర్ డబ్ల్వు ఇ ఇ శ్రీధర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, రాజేష్ ఇంజనీరింగ్ అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
————————————————————————————–
జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల చేజారీ చేయబడినది.