రెండు పడక గదుల ఇండ్లను త్వరితగతిన పూర్తి చేయాలి… జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

ప్రచురణార్థం

రెండు పడక గదుల ఇండ్లను త్వరితగతిన పూర్తి చేయాలి…

మహబూబాబాద్ ఆగస్టు 26.

రెండు పడక గదుల ఇండ్లను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు.

గురువారం కలెక్టర్ కార్యాలయంలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ ప్రగతిపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ 1671 ఇండ్ల నిర్మాణాలు జరుగుతుండగా 730 పూర్తయ్యాయి అన్నారు 941 గృహాల నిర్మాణాలు వేగవంతంగా నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

పెద్దవంగర కురవి మరిపెడ డోర్నకల్ గార్ల దంతాలపల్లి తదితర మండలాల తహసీల్దార్లు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ కొమరయ్య కలెక్టర్ కార్యాలయ పర్యవేక్షణ అధికారి వెంకటరమణ రెండు పడక గదుల ఇండ్ల సహాయ నోడల్ అధికారి సదానందం ఇంజనీరింగ్ అధికారులు తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు
—————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post