రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలి…

ప్రచురణార్ధం

రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలి…

మహబూబాబాద్, నవంబర్,20. రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణం లను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

శనివారం కలెక్టర్ కార్యాలయంలో రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణాలపై విద్యుత్కనెక్షన్లు, మిషన్ భగీరథ కనెక్షన్లు పై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.

పనుల జాప్యానికి గల కారణాలను విశ్లేషిస్తూ వేగవంతం చేయాలన్నారు. తొర్రురు, పెదవంగర మండలాలలో ఇండ్లను పూర్తి చేసి ఇవ్వాలన్నారు.

మరుగుదొడ్లు నిర్మించేందుకు, డి.పి.ఓ., డి.ఆర్.డి.ఓ. అధికారులతో సమీక్షించి చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఈ సమీక్ష సమావేశంలో 2బి.హెచ్.కె.డి.ఈ.సదానందం, ఇంజనీరింగ్ అధికారులు, తహసీల్దార్ లు పాల్గొన్నారు.
————————————————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ వారిచే జారిచేయనైనది.

Share This Post