ప్రచురణార్థం
మహబూబాబాద్ డిసెంబర్ 1.
డోర్నకల్ నియోజకవర్గం లో చేపడుతున్న రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.
గురువారం కలెక్టర్ కార్యాలయంలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాల ప్రగతి పై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 1800 నిర్మాణాలు చేపట్టగా వాటిని త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
పూర్తయిన చిలంచర్ల ఉయ్యాలవాడ మొగిలిచర్ల ఇళ్లకు లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలని అదనపు కలెక్టర్ కు సూచించారు.
వివిధ దశల్లో ఉన్న ఇళ్లను జనవరి మాసంతానికి పూర్తి చేయాలన్నారు.
ఈ సమీక్ష సమావేశంలో ఇంజనీరింగ్ అధికారులు అరుణ్ కుమార్ సదానందం కలెక్టర్ కార్యాలయం ఏవో వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.