రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలి… జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

ప్రచురణార్థం

రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలి…

మహబూబాబాద్, జూలై-29:
రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలను నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు.

గురువారం కలెక్టర్ కార్యాలయంలో రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణాలపై సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.

జిల్లాలో రోడ్లు భవనాల శాఖ ద్వారా 880 చేపట్టగా 225 పూర్తి చేయడం జరిగిందని అదేవిధంగా టీఎస్ ఈ డబ్ల్యు ఐ డి సి ఆధ్వర్యంలో 2409 ఇండ్లకు 517 నీటిపారుదల శాఖ ద్వారా 1183 ఇండ్లకు 248 పాలకుర్తి నియోజకవర్గంలో t w i d c ద్వారా 503 ఇండ్లకు 341 భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో 330 ఇండ్లకు 138 పూర్తి చేయడం జరిగిందన్నారు ములుగు నియోజకవర్గంలో 44 ట్రైబల్ వెల్ఫేర్ ద్వారా 255 చేపట్టిన ఇండ్లు వివిధ దశల్లో ఉన్నాయి అన్నారు మొత్తంగా 5604 ఇండ్లకు గాను 1469 ఇండ్లు పూర్తి కాగా మిగతా ఇండ్లు వివిధ అభివృద్ధి దశల్లో ఉన్నాయన్నా ని అధికారులు కలెక్టర్కు వివరించారు

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిరుపేదలకు సొంత ఇల్లు కల లాంటిదని ప్రభుత్వం నిరుపేదల కల సాకారం చేసేందుకు జిల్లాలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలను చేపట్టిందన్నారు. అధికారులు బాధ్యతతో పని చేసి నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత సమయంలో సాధించాలన్నారు.
కాంట్రాక్టర్లు సకాలంలో స్పందించకపోతే బ్లాక్లిస్టులో పెట్టాలన్నారు టెండర్లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు స్లాబ్, పెయింటింగ్స్ పూర్తయిన ఇండ్ల పనులు వేగవంతం చేసి ఆగస్టు 10 లోపు తాసిల్దార్ లకు అప్పగించాలి అన్నారు. రెండు పడక గదుల ఇండ్లకు తప్పనిసరిగా రోడ్లు విద్యుత్తు త్రాగునీరు సౌకర్యాలు ఉండాలన్నారు

ఈ సమీక్ష సమావేశంలో నీటిపారుదల అధికారులు పూర్ణచంద్, పాలకుర్తి ఇ ఈ రమేష్ బాబు, డి ఈ గౌతమి శిల్ప, రోడ్లు భవనాలు అధికారులు ఈ ఈ తానేశ్వర్, డి ఈ రాజేందర్, ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు టి ఎస్ ఈ డబ్ల్యు ఐ డి సి అధికారులు డి ఈ అరుణ్ కుమార్, ట్రైబల్ వెల్ఫేర్ ఏటూరునాగారం ఈ ఈ హేమలత, డి ఈ మధుకర్, భద్రాచలం ఐటిడిఎ డి ఈ రాజు, రెండు పడక గదుల ఇండ్ల పర్యవేక్షకులు డి ఈ సదానందం, కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి వెంకటరమణ, తొర్రూరు ఏ ఈ లు నవ్య, జలంధర్ తదితరులు పాల్గొన్నారు.
—————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post