*రెండు మద్యం దుకాణాల కేటాయింపుకు 57 దరఖాస్తులు : ఎక్సైజ్ సీఐ ఎం.పీ.ఆర్. చంద్రశేఖర్*

*రెండు మద్యం దుకాణాల కేటాయింపుకు 57 దరఖాస్తులు : ఎక్సైజ్ సీఐ ఎం.పీ.ఆర్. చంద్రశేఖర్*

*ప్రచురణార్థం-1*

*నేడు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ అధ్యక్షతన లక్కీ డ్రా*

రాజన్న సిరిసిల్ల, నవంబర్ 29: జిల్లాలో దరఖాస్తులు తక్కువగా వచ్చిన కారణంగా లైసెన్స్ డ్రా తీయకుండా నిలిపివేసిన నిమ్మపెల్లి, రుద్రంగి మద్యం దుకాణాల కేటాయింపుకు నిర్వహించిన దరఖాస్తుల ప్రక్రియకు విశేష స్పందన లభించిందని ఎక్సైజ్ సీఐ ఎం.పీ.ఆర్. చంద్రశేఖర్ అన్నారు.
ఈ మేరకు సోమవారం సాయంత్రం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, జిల్లాలో రుద్రంగి, కోనరావుపేట మండలం నిమ్మపెల్లి గ్రామంలోని మద్యం దుకాణాల కేటాయింపు కోసం దరఖాస్తులు ఆహ్వానించగా, నిమ్మపెల్లి దుకాణానికి 26, రుద్రంగి దుకాణానికి 31 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. దీనికి సంబంధించిన లైసెన్స్ లక్కీ డ్రా నేడు (మంగళవారం) ఉదయం 11 గంటలకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి గారి అధ్యక్షతన తీయడం జరుగుతుందని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Share This Post