రెండు రోజుల్లో వర్ష విలువ అభివృద్ధి పనులు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

 

రెండు రోజుల్లో వర్ష కాలువ అభివృద్ధి పనులు పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
—————————-

కొలనూర్ పెద్ద చెరువు నుండి మధ్య మానేరు బ్యాక్ వాటర్ వరకు చేపడుతున్న వర్ష కాలువ అభివృద్ధి , అధునీకరణ పనులను వచ్చే 2 రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.

మంగళవారం కోనరావుపేట మండలం కొలనూరు గ్రామంలో పెద్ద చెరువు నుండి వయా రగుడు పెద్ద చెరువు, కలెక్టరేట్ మీదుగా మానేరు జలాశయం బ్యాక్ వాటర్ వరకు 7.5 కిలో మీటర్ల మేర
చేపడుతున్న వర్షా కాలువ అభివృద్ధి ఆధునీకరణ పనులను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

వర్షాకాలంలో కొలనూరు గ్రామంలోని ఎగువ ప్రాంతాల నుండి సుమారు 12 చెరువులకు సంబంధించి వాటర్ కొలనూరు పెద్ద చెరువుకు,అక్కడ సర్ ప్లస్ అయిన వాటర్ కొలనూరు పెద్ద చెరువు మత్తడి నుండి వర్ష కాలువ గుండా రగుడు పెద్ద చెరువు కు వర్షపు నీరు చేరుకుంటుంది. అక్కడి నుండి కలెక్టరేట్ సమీప ప్రాంతం నుండి మధ్య మానేరు కు వర్షపు నీరు వెళ్లనుంది.

వర్షపు కాలువ పూడి పోవడం, ఆక్రమణలకు గురవ్వడం, చెట్ల పొదలతో నిండి పోవడంతో కాలువ ను పూర్తి సామర్థ్యంతో వర్షపు నీరు వెళ్లేలా చూసేందుకు గత నెల 16 న పనులు ప్రారంభించారు. ఇంకో రెండు రోజుల్లో పనులు పూర్తి చేయాలన్న జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.

పనుల పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట ఇరిగేషన్ ఈ ఈ అమరేందర్ రెడ్డి, dee సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

—————————–

Share This Post