రెండు రోజుల్లో స్మశాన వాటిక పనులు పూర్తి చేయాలి… జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

ప్రచురణార్థం

రెండు రోజుల్లో స్మశాన వాటిక పనులు పూర్తి చేయాలి…

నెల్లికుదురు
మహబూబాబాద్, జూలై-28:

స్మశాన వాటిక పనులు రెండు రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు.

బుధవారం నెల్లికుదురు మండలం మునిగలవీడు గ్రామంలో పర్యటించి పల్లె ప్రకృతి వనం, స్మశాన వాటిక లను సందర్శించారు.

పల్లె ప్రకృతి వనం లో నిర్వహణ లోపం కనిపించడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్ర స్థాయి అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. స్మశాన వాటిక ను సందర్శించారు. అసంపూర్తిగా పనులు ఉండటంతో ఇది సరికాదని పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారు. అనంతరం అదే గ్రామం లోని అవెన్యూ ప్లాంటేషన్ పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. మొక్కలకు ఫెన్సింగ్ గా బ్రష్ వుడ్ చేయరాదని, తప్పనిసరిగా ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేయాలని, మొక్కలకు సపోర్టింగ్ కర్రలు పాటించాలని తెలిపారు.
అవెన్యూ ప్లాంటేషన్ గ్రామానికి అందం చేకూర్చాలని, క్రమ పద్ధతిలో ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. ట్రీ గార్డ్ దొంగిలిస్తే ట్రీ గార్డ్ ఖర్చు 130 రూపాయలు ఉండగా దానికి 10 వంతులు జరిమానా విధించాలని కలెక్టర్ అధికారులకు తెలియజేశారు.

ట్రీ గార్డ్స్ కు గ్రామం పేరు వ్రాయించాలన్నారు. ట్రీ గార్డ్స్ కూడా వివిధ రంగులలోవి ఏర్పాటు చేస్తే మరింత అందం గా కనిపిస్తాయని అన్నారు. మండలంలో బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

అనంతరం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో ధరణి రిజిస్ట్రేషన్ ను పరిశీలించారు. క్రయ విక్రయదారులతో కలెక్టర్ మాట్లాడారు. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని అందుకోసమే ధరణి విభాగమని తెలియజేశారు.

ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించి ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. అవెన్యూ ప్లాంటేషన్ తో గ్రామాలకు అందం చేకూరాలని, మొక్కలను క్రమపద్ధతిలో నాటాలని తెలియజెప్పారు. గ్రామాలలో శానిటేషన్ మెరుగుపరచాలని, ప్రతిరోజు చెత్త సేకరణ జరగాలని, సెగ్రిగేషన్ షెడ్ లో తడి, పొడి చెత్త విభజన జరగాలని, వర్మి కంపోస్టు చేపట్టాలన్నారు. ట్రీ గార్డ్ దొంగిలిస్తే జరిమానా విధించాలని అన్నారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు బస్సు సౌకర్యం కొరకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి అందించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి, మండల ప్రత్యేక అధికారి బాలరాజు, ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి, తాసిల్దార్ రఫీ, పంచాయతీ సెక్రెటరీ ఉమేష్, సర్పంచ్ నవీన్ రావు, తదితరులు పాల్గొన్నారు
———————————————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి మహబూబాబాద్ చే జారీ చేయడమైనది.

Share This Post