రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మాస్క్ లను పంపిణి చేసిన అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ

రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మాస్క్ లను పంపిణి చేసిన అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ

ప్రచురణార్థం

రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మాస్క్ లను పంపిణి చేసిన అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ

పెద్దపల్లి, ఫిబ్రవరి -16:

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, పెద్దపల్లి ఆధ్వర్యంలో బుధవారం అడిషనల్ కలెక్టర్ లక్ష్మినారాయణ చేతులమీదుగా మాస్క్ లను తన ఛాంబర్ లో పంపిణి చేశారు.

ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ లక్ష్మినారాయణ మాట్లాడుతూ, పెద్దపల్లి లోని వివిధ పత్రికల్లో పనిచేయుచున్న పత్రికా విలేకరులకు ఈ మాస్కులను అందించనైనదని, సమ్మక్క- సారలమ్మ జాతర సందర్బంగా ప్రజలందరూ మాస్క్ లు ధరించి, కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కన్వినర్ కావేటి రాజగోపాల్, సభ్యులు డివిఎస్. మూర్తి, మంథని నర్సింగ్, పంపటి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

——————————————–
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం,
పెద్దపల్లి చే జారి చేయనైనది.

Share This Post