రెడ్ క్రాస్ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రిక ప్రకటన.    తేది:29.12.2021, వనపర్తి.

ప్రతి ఒక్కరూ రెడ్ క్రాస్ సభ్యత్వం తీసుకోవాలని, దాతలు రెడ్ క్రాస్ కు విరాళాలు అందించి రెడ్ క్రాస్ బలోపేతానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష సూచించారు.
బుధవారం జిల్లా కలెక్టర్ చాంబర్ లో జిల్లా కలెక్టరేట్ సిబ్బందికి రెడ్ క్రాస్ సభ్యత్వ కార్డులను జిల్లా కలెక్టర్ అందచేశారు. జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి రెడ్ క్రాస్ సభ్యత్వం తీసుకొని, వారి సిబ్బందికి రెడ్ క్రాస్ సభ్యత్వం ఇప్పించుటకు చేసిన కృషికి వి. రమణను ఆమె అభినందించారు. జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయ సిబ్బంది కిరణ్ కుమార్ రెడ్డి, శ్రీకాంత్ లకు సభ్యత్వ నమోదు గుర్తింపు కార్డులను జిల్లా కలెక్టర్ అందచేశారు.
జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ 2021-22 సంవత్సరంలో రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో వనపర్తి జిల్లా ముందంజలో ఉన్నదని, జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణాధికారి వెంకట్ రెడ్డి కృషి సభ్యత్వ నమోదులో అభినందనీయమని, తహసిల్దార్లలో కొత్తకోట తహసిల్దార్ వెంకటేశ్వర్లు రూ 2,50,000/- సభ్యత్వ నమోదు ద్వారా సేకరించి ముందంజలో ఉన్నారని, కొత్తకోట తహసిల్దార్, ZP CEO, CPO లను ఆదర్శంగా తీసుకొని తహసిల్దార్లు, జిల్లా అధికారులు సభ్యత్వ నమోదు కొరకు ముందుకు రావాలని ఆమె సూచించారు.
రెడ్ క్రాస్ అంతర్జాతీయ సంస్థ అని, విరాళాలు, సభ్యత్వ నమోదు ద్వారా వచ్చిన డబ్బులను సామాజిక కార్యక్రమాలు చేయటానికి, పెద్దమనసుతో దాతలు ముందుకు రావాలని అన్నారు. విరాళాల ద్వారా, సభ్యత్వ నమోదు ద్వారా ఆర్థిక సహాయం చేసి, రెడ్ క్రాస్  ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేయుటకు ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ ఖాజ కుత్బుద్ధిన్, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి సి. వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.
………..
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post