రెడ్ క్రాస్, వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఆసుపత్రిలో “రక్త దాన శిబిరం : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన   తేది:17.08.2022, వనపర్తి
      అన్ని దానాలలోకెల్ల రక్తదానం మిన్నయని, అత్యవసర పరిస్థితులలో ఉండి రక్తం అవసరమయ్యే వారికి రక్త దాతలు ప్రాణదాతలతో సమానమని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అన్నారు.
      స్వతంత్ర భారత వజ్రోత్సవా లలో భాగంగా బుదవారం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో రెడ్ క్రాస్ సొసైటీ, వైద్య, ఆరోగ్య శాఖ ఆద్వర్యంలో నిర్వహించిన “రక్తదాన శిబిరాన్ని” జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఆగస్టు 8వ తేది నుండి 22వ తేది వరకు ప్రతిరోజు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందుబాటులో లేకపోవడం వలన ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారని, ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని, 3 నెలల పాటు నిల్వ ఉంటుందని ఆమె సూచించారు. “రక్తదాన శిబిరం” కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలలో ఏర్పాటు చేసినట్లు ఆమె వివరించారు. రక్త దాతలు రక్తదానం చేయడం ద్వారా ఒక వ్యక్తినే గాక ఆ కుటుంబాన్ని మనం ఆదుకున్నవారం అవుతామని ఆమె తెలిపారు.
 ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రవి శంకర్, రెడ్ క్రాస్ చైర్మన్ ఖాజా కుత్భోద్దీన్, మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి, నోడల్ ఆఫీసర్, టి.బి.ప్రోగ్రామింగ్ అధికారి డాక్టర్ సాయినాథ్ రెడ్డి, మెడికల్ కళాశాల సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్ర కుమార్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజ్ కుమార్, ఆర్.ఎం.ఓ. డా. చైతన్య గౌడ్, మిషన్ భగీరథ డి.ఈ. జగన్మోహన్, ఆసుపత్రి డాక్టర్లు తదితరులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
……..
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారి చేయనైనది.

Share This Post