రెడ్ క్రాస్ సోసాయిటి లోని సభ్యులు ఎలాంటి లాభాపేక్ష లుకుండా నిస్వార్థంగా సేవలు అందించాలని అదనపు కలెక్టర్, జిల్లా రెడ్ క్రాస్ వైస్ ప్రెసిడెంట్ కె చంద్రా రెడ్డి అన్నారు

రెడ్ క్రాస్ సోసాయిటి లోని సభ్యులు ఎలాంటి లాభాపేక్ష లుకుండా నిస్వార్థంగా సేవలు అందించాలని అదనపు కలెక్టర్, జిల్లా రెడ్ క్రాస్ వైస్ ప్రెసిడెంట్ కె చంద్రా రెడ్డి అన్నారు.  మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నారాయణపేట బ్రాంచ్ రెడ్ క్రాస్ సోసాయిటి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.  మొత్తం 12 మంది కార్యవర్గ సభ్యులు ఎన్నుకొనగా వారిచే అదనపు కలెక్టర్ ప్రమాణ స్వీకారం చేయించారు.  అనంతరం 12 మందిలో నుండి చైర్మన్ గ  కె. సుదర్శన్ రెడ్డి,   వైస్ చైర్మన్ గా కె. నాగరాజు, కోశాధికారి మదన్ మోహన్ రెడ్డి, ఎం.సి మెంబర్ గా ఎ. ఆత్మారామ్  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ  బాడీ లో ఉన్నవారే పని చేయాలని లేదని,  మెంబెర్ గా ఉండీ సైతం సేవలు అందించవచ్చూ అన్నారు.  ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కి ప్రెసిడెంట్ గా జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తారని, వైస్ ప్రెసిడెంట్ గా అదనపు కలెక్టర్ ఉంటారని తెలిపారు.   కమిటీ కార్యవర్గ మెంబర్లుగా 1. ఏ.బి. చెన్నారెడ్డి, 2. డా. నర్సింగ్ రావ్, 3. కడుమురు శ్రీనివాస్ 4. జొన్నల శభాష్ రెడ్డి 5. జొన్నల జయంత్ రెడ్డి 6. ఆత్మారామ్ ఎడికే 7.యం. జనార్దన్ 8. డా. డి. మధుసూదన్ రెడ్డి 9. నందకిశోర్ 10. శ్రీనివాస్ లాహోటి 11.కె. సుదర్శన్ రెడ్డి12.కె. నాగరాజు ఎంపిక అయి ప్రామాణ స్వీకారం చేశారు

Share This Post