*రెవెన్యూ దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి*
*ప్రచురణార్థం-2*
రాజన్న సిరిసిల్ల, జనవరి 07: ప్రజా ఫిర్యాదులు, రెవెన్యూ దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి మండల తహశీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా ఫిర్యాదులను మొదటి ప్రాధాన్యత ఇచ్చి వారి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. రెండు పడక గదుల ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. విద్యార్థులకు ప్రీమెట్రిక్ స్కాలర్ షిప్ కు సంబంధించి వారికి కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు అవసరం ఉంటాయని, వారు మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న వెంటనే సంబంధిత తహశీల్దార్లు విద్యార్థులకు ధృవీకరణ పత్రాలు మంజూరు చేయాలని ఆదేశించారు. కోర్టు కేసుల పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఇంచార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి టి. శ్రీనివాస రావు, వేములవాడ ఆర్డీఓ వి. లీల, ఎస్సీ సంక్షేమ అధికారి భాస్కర్ రెడ్డి, సిరిసిల్ల తహశీల్దార్ విజయ్ కుమార్, పర్యవేక్షకులు రమేష్, రవికాంత్, సుజాత, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.