రేపటికల్లా పిల్లలందరికీ వ్యాక్సినేషన్ పూర్తి కావాలి – కలెక్టర్

 

రేపటికల్లా 15 నుండి 18 సంవత్సరాల లోపు పిల్లలందరికీ నూటికి నూరు శాతం వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి వైద్య ఆరోగ్య, విద్య శాఖ అధికారులు, ఆర్ డి వో ల ఆదేశించారు.

గురువారం నాడు కలెక్టరేట్ నుండి సంబంధిత అధికారులతో వ్యాక్సినేషన్ పై సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒమిమైక్రాన్ వేరియంటూ పిల్లల పైన యొక్క ప్రభావాన్ని చూపుతుందని అందువల్ల 15 సంవత్సరాలు దాటిన పిల్లలందరికీ కూడా తప్పనిసరిగా వ్యాక్సినేషన్ అందించడానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని తెలిపారు. ఒక లక్ష 20 వేల పిల్లలు లక్ష్యం కాగా ఇప్పటికీ కేవలం 26వేల మందికి మాత్రమే వేసినందున 8వ తేదీ నుండి సెలవులు ఉన్న నేపథ్యంలో రేపటికల్లా పూర్తి చేయడానికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 300 టీంలను ప్రతి విద్యా సంస్థకు రేపు ఉదయానికల్లా ఉండేవిధంగా ఆదేశాలు జారీ చేయాలని రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తిచేయాలని తెలిపారు. ఈ రెండు రోజుల పాటు ఆర్డీవోలు డిప్యూటీ డిఎంఅండ్హెచ్ఓ విద్యా సంస్థ అధికారులు ఈ కార్యక్రమంపైనే దృష్టి కేంద్రీకరించి ప్రత్యేక డ్రైవ్ తో కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. అర్హత గల విద్యార్థులు ఉన్న ప్రతి విద్యా సంస్థలో వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో ఆర్డీవోలు బాధ్యత తీసుకొని పర్యవేక్షణ చేయాలని తెలిపారు.

ఈ సెల్ కాన్ఫరెన్స్ లో ఇన్ఛార్జి మున్సిపల్ కమిషనర్/అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రా, డిఎంఅండ్హెచ్ఓ సుదర్శన్ం, ఆర్ డి వో లు రవి, రాజేశ్వర్, శ్రీనివాస్, డిప్యూటీ డిఎంఅండ్హెచ్ఓలు, డి ఐ ఓ శివ శంకర్, వైద్య శాఖ అధికారులు, డీఈవో దుర్గాప్రసాద్, డి ఐ ఈ ఓ రఘు రాజ్, గిరిరాజ్ కళాశాల ప్రిన్సిపాల్, తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post