రేపటి నుండి బతుకమ్మ చీరల పంపిణీ : జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య.

 

వార్త ప్రచురణ
తేదీ.01.10.2021.
ములుగు జిల్లా.

అక్టోబర్ -2 నుండి జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించ నున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య సంబందిత అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు . ఈ కాన్ఫరెన్స్ ద్వారా బతుకమ్మ చీరల పంపిణి లో బాగంగా జిల్లా స్థాయి నుండి నోడల్ అధికారులు గా డిఆర్డిఓ/ఇంచార్జ్ అదనపు కలెక్టర్ లోకల్ బాడి నాగ పద్మజ ,డిఆర్వో రమాదేవి ,డిపి ఓ వెంకయ్య లు, మరియు మండల స్థాయి లో తసిల్దార్స్,ఎంపి డీఓలు ,ఎంపిపిలు ఉంటారని ,గ్రామ స్థాయి లో పంచాయితి కార్యదర్శులు ,విఆర్వో , అంగన్వాడి కార్యకర్తలు , వివొలని ,రేషన్ షాప్ డీలర్స్ ఉంటారని, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ యొక్క కార్యక్రాన్ని నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సంబందిత అధికారులను ఆదేశించారు.

జిల్లా కలెక్టర్ కార్యాలయం లో రేపు ప్రారంబించ నున్న బతుకమ్మ చీరల పంపిణి కార్యక్రమనికి ప్రజా ప్రతినిధులు, అధికారులు ,లబ్దిదారులు పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ గారు కోరారు.
జిల్లా లో మొత్తం లక్షా పది వేల ఏడూ వందల ఎనబది నలు బతుకమ్మ చీరలను జిల్లా కు కేటాయించడం జరిగిందని , మండలాల వారిగా పంపిణి చేయవలసిన బతుకమ్మ చీరలను పంపించడం జరిగిందని వారు అన్నారు. జిల్లా లో కోవిడ్ వ్యక్సినేషన్ తీసుకొని వారు ఉన్నట్లు ఐతే వారిని గుర్తించి వ్యాక్సినేషన్ పూర్తి చేయాలనీ సంబందిత అధికారులను ఆదేశించారు . అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ప్రతి గ్రామ పంచాయితీ , ప్రభుత్వ కార్యాలయాలలో శ్రమ – దానం కార్యక్రమలు చేపట్టాలని, గాంధీ జయంతిని ఉత్సవాన్ని ఘనం గా నిర్వహించాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అన్నారు.

ఈ కార్యక్రమంలో మండలాల తహశీల్దార్లు,మండలాల ప్రత్యేక అధికారులు, మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Share This Post