రేపటి ఫ్రీడమ్ రన్ కార్యక్రమంలో జిల్లాలోని యువత, క్రీడాకారులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరూ భాగస్వాములై ఫ్రీడమ్ రన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి – జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

రేపటి ఫ్రీడమ్ రన్ కార్యక్రమంలో జిల్లాలోని యువత, క్రీడాకారులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరూ భాగస్వాములై ఫ్రీడమ్ రన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ నేడోక ప్రకటనలో తెలిపారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా రేపు ఉదయం 6.30 నిమిషాలకు కలెక్టర్ కార్యాలయ ప్రాంగణం నుండి నాగర్ కర్నూల్ కేసరి సముద్రం ట్యాన్క్ బండ్ పై మైసమ్మ గుడి వరకు ఈ ఫ్రీడమ్ రన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నో త్యాగాలు, ఎంతో మంది బలిదానాలతో సిద్ధంచిన భారత దేశంలో నేడు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నాము. దేశం కొరకు పోరాటం చేసన త్యాగధనులను స్వరిస్తూ దేశ సమగ్రతకై ఏర్పాటు చేసిన ఈ ఫ్రీడమ్ రన్ లో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కెలెక్టర్ పిలుపునిచ్చారు.

Share This Post