రేపు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహణ : చేనేత,జౌళి శాఖ సహాయ సంచాలకులు కె.విద్యా సాగర్

పత్రికా ప్రకటన     తేది:6.8.2021, నల్గొండ

రేపు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహణ
నల్గొండ, ఆగస్ట్ 6. రేపు ఆగస్ట్ 7 న శనివారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రం లో చేనేత ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చేనేత,జౌళి శాఖ సహాయ సంచాలకులు కె.విద్యా సాగర్ ఒక ప్రకటనలో తెలిపారు.ర్యాలీ రేపు ఉదయం 9.30 ని.లకు గాంధీ విగ్రహ కూడలి నుండి క్లాక్ టవర్ వరకు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.అనంతరం ఉదయం 11 గంటలకు కలెక్టర్ కార్యాలయం ఉదాయాదిత్య భవన్ లో చేనేత కళాకారులచేనేత సంఘాల కార్మికులకు సన్మాన కార్యక్రమం నిర్వహించ నున్నట్లు ఆయన ఈ ప్రకటన లో పేర్కొన్నారు

………………..

డి.పి.ఆర్.ఓ, నల్గొండ ద్వారా జారీ చేయబడినది.

Share This Post