రేపు సిద్దిపేట జిల్లాలో మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు పర్యటన

రేపు సిద్దిపేట జిల్లాలో మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు పర్యటన

మంగళవారం రాష్ట్ర ఆర్థిక,వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు.

ఉదయం 10.00 గంటలకు సిద్దిపేట పట్టణంలో భారత మాజీ ఉప ప్రధాని డా. బాబు జగ్జీవన్ రామ్ 115 వ జయంతి వేడుకల్లో పాల్గొంటారు.

అనంతరం ఉదయం 11.00 గంటలకు మంత్రి వివిధ కార్యక్రమాలలో పాల్గొనేందుకు వీలుగా గజ్వేల్ పట్టణం కు చేరుకుంటారు.
గజ్వేల్ లో దళిత బంధు పథకంను పథకం ను ప్రారంభించి లబ్దిదారులకు పథకం కింద మంజూరైన యూనిట్ లను పంపిణీ చేస్తారు. అనంతరం లబ్ధిదారుల తో సహపంక్తి భోజనం చేస్తారు.

ఆ వెంటనే గజ్వేల్ మహతి ఆడిటోరియంలో జగదేవ్ పూర్ మండలం కొత్తపేట, ఇటిక్యాల, లింగారెడ్డి పల్లి గ్రామాల రైతులకు పట్టా సర్టిఫికేట్ లను పంపిణి చేస్తారు.

తదనంతరం గజ్వేల్ పట్టణంలో భారత మాజీ ఉప ప్రధాని డా. బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. చివరగా ఐస్ ల్యాండ్ ను మంత్రి ప్రారంభిస్తారు.

Share This Post