రేపు సిద్ధిపేటలో లీగల్ సర్వీసెస్ మెగా క్యాంపు : జిల్లా కలెక్టర్ శ్రీ వెంకట్రామ రెడ్డి

ఘనంగా చేద్దాం.. విజయవంతం చేద్దాం

జాతీయ న్యాయసేవా అధికార సంస్థ ప్రారంభమై 25 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని, సిల్వర్‌ జూబ్లీ 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘ఆజాదికా అమృత్‌ మహోత్సవ్‌’ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 13న లీగల్‌ సర్వీసెస్‌ మెగా క్యాంపును జిల్లా కేంద్రమైన సిద్ధిపేట విపంచి ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీ వెంకట్రామ రెడ్డి చెప్పారు.

ఈ మేరకు జిల్లా కలెక్టర్ ప్రకటన విడుదల చేసారు.
ప్రజలందరికీ న్యాయపరమైన ఉచిత సేవలు, హక్కులపై అవగాహన కల్పించేందుకు జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు, లీగల్ సర్వీసెస్ బలోపేతం చేయడమే ఈ కార్యక్రమ ఉద్దేశ్యమని తెలిపారు. విపంచిలో శాఖల వారీగా స్టాల్స్ బాగుండాలని, కావాల్సిన ఏర్పాట్లు చేయాలని ఆయా శాఖాధికారులకు సూచించారు.

Share This Post