రేపే రేషన్ డీలర్ల ఎంపిక కోసం రాత పరీక్ష

– సిద్దిపేట పట్టణం కొండ మల్లయ్య గార్డెన్ లో రాత పరీక్ష

– మధ్యాహ్నం 03.00 గంటలకు పరీక్ష ప్రారంభం

– అభ్యర్థులు హాల్ టికెట్ లు, ఆధార్ తో సకాలంలో పరీక్ష కేంద్రం కు రావాలి

– సిద్దిపేట RDO శ్రీ అనంత రెడ్డి

రేషన్ డీలర్ (దాచిన చిత్రం)
సిద్దిపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోని రేషన్ డీలర్ల ఎంపిక కోసం రేపు ( ఈ నెల 18 వ తేదీ శనివారం) సిద్దిపేట పట్టణంలోని కొండ మల్లయ్య గార్డెన్ లో రాత పరీక్ష నిర్వహించనున్నట్లు సిద్దిపేట డివిజనల్ అధికారి శ్రీ అనంత రెడ్డి తెలిపారు.

ఈ మేరకు ఆయన శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటన జారీ చేశారు.

సరిగ్గా మధ్యాహ్నం 03.00 గంటలకు సిద్దిపేట పట్టణం కొండ మల్లయ్య గార్డెన్ లో రేషన్ డీలర్ల ఎంపిక కోసం రాత పరీక్ష ప్రారంభమై గంట పాటు జరుగుతుందన్నారు.ఇప్పటికే రాత పరీక్ష కు సంబంధించి అభ్యర్థుల మొబైల్ లకు మెసేజ్ లు పంపామని తెలిపారు. హాల్ టికెట్ లు కూడా అభ్యర్థులందరికీ పంపించామన్నారు.సిద్దిపేట డివిజన్ పరిధిలో డీలర్ల ఎంపిక రాత పరీక్ష కు హరజయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా హాల్ టికెట్ లు, ఆధార్ కార్డు తో సహా సకాలంలో పరీక్షకు హాజరు కావాలనీ సిద్దిపేట రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీ అనంత రెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు.

Share This Post