రేవల్లి మండలం చెన్నారం, గొల్లపల్లి, కొంకలపల్లి, గోపాల్ పేట మండలం తాడిపర్తి గ్రామాలలోని బృహత్ పల్లె ప్రకృతి వనాలను పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్

పత్రికా ప్రకటన.    తేది:28.12.2021, వనపర్తి.

ప్రభుత్వం చేపట్టిన బృహత్ పల్లె ప్రకృతి వనాల పనులను ఎలాంటి జాప్యం లేకుండా పకడ్బందీగా చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు.
మంగళవారం రేవల్లి మండలంలోని చెన్నారం, గొల్లపల్లి, కొంకలపల్లి గ్రామాలలోని బృహత్ పల్లె ప్రకృతి వనాలను, గోపాల్ పేట మండలంలోని తాడిపర్తి గ్రామాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరితహారం కింద చేపట్టిన బృహత్ పల్లె ప్రకృతి వనాలలోని మొక్కలను ఎప్పటికప్పుడు సిద్ధం చేయాలని, ప్రతిరోజు మొక్కలకు నీరు అందించటం, ఎండిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటడం, మొక్కలను ఏర్పాటు చేయటం వంటి పనులను చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు.
చెన్నారం గ్రామంలో పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించి, అవెన్యూ ప్లాంటేషన్ ను జంతువుల నుండి రక్షణ కొరకు “ట్రీ గార్డ్”, ముళ్ళ పొదలుతో ఏర్పాటు చేసిన రక్షణ కవచంను చూసి ఆయన అక్కడి గ్రామ అధికారులను అభినందించారు. ప్రతి గ్రామంలో ఇలాంటి “ట్రీ గార్డ్” లను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆయన సూచించారు.
తాడిపర్తి గ్రామంలోని అవెన్యూ ప్లాంటేషన్ పరిశీలించి, వాటిపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని సిబ్బందికి ఆయన ఆదేశించారు. ప్రతిరోజు మొక్కలకు నీరు అందించడం, ఇంటింటి చెత్త సేకరణ కార్యక్రమాలు చేపట్టటం, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచటంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన తెలిపారు.
జిల్లా అదనపు కలెక్టర్ వెంట మండల అధికారులు, గ్రామ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
…………
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post