రేషన్ కార్డుదారులకు ఇచ్చే బియ్యంలో తూకంలో వ్యత్యాసం ఉంటే చర్యలు తీసుకుంటాం – అదనపు కలెక్టర్ మోతిలాల్

రేషన్ కార్డుదారులకు ఇచ్చే బియ్యంలో తూకంలో వ్యత్యాసం ఉంటే చర్యలు తీసుకుంటాం – అదనపు కలెక్టర్ మోతిలాల్

రేషన్ కార్డుదారులకు సకాలంలో సరుకులు అందించాలని రేషన్ డీలర్లుకు అదనపు కలెక్టర్ మోతిలాల్ ఆదేశించారు.

గురువారం జిల్లా కేంద్రంలోని ఉన్న పలు చౌకధర దుకాణాలను ఆయన ఆకస్మాత్తుగా వెళ్లి తనిఖీ చేశారు. గోదావరి నుంచి వచ్చిన బియ్యం బస్తాల తూకం సరిగా ఉందా లేదా అని పరిశీలించారు.

రేషన్ దుకాణదారుల సకాలంలో ప్రజలకు బియ్యాన్ని సకాలంలో అందజేయాలన్నారు. పలువురు కార్డుదారులను అడిగి తెలుసుకున్నారు. కొందరు రేషన్ డీలర్లు గోదాం నుండి బియ్యం సంచుల్లో తక్కువ  వస్తున్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అది వాస్తవం కాదని తెలిపారు.

అలా చెప్పి వినియోగ దారులకు ఇచ్చే బియ్యం తక్కువ చేసి ఇస్తే చర్యలు తీసుకుంటామని దుకాణదారులను ఆయన హెచ్చరించారు.

ప్రతి బస్తాలు 50 కేజీల పైనే బియ్యం ఉంటున్నాయన్నారు. పొరపాటున తక్కువ వచ్చిన దానికి సంబంధించిన అధికారులకు తెలియజేస్తే ఇస్తారని అన్నారు.

ఆయన వెంట జిల్లా పౌర సరఫరాల అధికారి మోహన్ బాబు, జిల్లా పౌర సరఫరాల మేనేజర్ బాలరాజ్ తదితరులు ఉన్నారు.

Share This Post