రేషన్ కార్డులు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన శాసనమండలి ప్రొటెంచైర్మన్ భూపాల్ రెడ్డి,ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి *ప్రతి పేదవాడు మూడుపూటలా అన్నం తినాలన్న ఆశయంతో అర్హులైన పేదలందరికీ ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులు ఇస్తుందనీ శాసనమండలి ప్రొటెంచైర్మన్ భూపాల్ రెడ్డి అన్నారు.

పత్రికా ప్రకటన
పఠాన్ చెరు , జూలై 30:–

రేషన్ కార్డులు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన శాసనమండలి ప్రొటెంచైర్మన్ భూపాల్ రెడ్డి,ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

*ప్రతి పేదవాడు మూడుపూటలా అన్నం తినాలన్న ఆశయంతో అర్హులైన పేదలందరికీ ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులు ఇస్తుందనీ శాసనమండలి ప్రొటెంచైర్మన్ భూపాల్ రెడ్డి అన్నారు.

రామచంద్రాపురం లోని లక్ష్మీ గార్డెన్స్ ఫంక్షన్ హాల్ లో లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి ,షాది ముబారక్ చెక్కులను తెలంగాణ శాసన మండలి ప్రొటెం చైర్మన్ వి.భూపాల్ రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిలు లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

రామచంద్రపురం మండలానికి చెందిన 95 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను,209 మంది లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా శాసన మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి మాట్లాడుతూ ఆకలితో ఎవరు అలమటించకూడదన్నదే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉన్నారని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ,పేద వర్గాల అభ్యున్నతికి నిరంతరం శ్రమిస్తున్నారని అన్నారు.

ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేరిట కోట్ల రూపాయల ఖర్చతో పేద కుటుంబాల ఆడపిల్లల పెళ్లిళ్లు జరిపిస్తున్నదన్నారు.ఇది ప్రభుత్వం ఇస్తున్న భరోసా అని ఆయన పేర్కొన్నారు.ప్రతి పేదవాడు మూడు పూటలా కడుపునిండా భోజనం చేయాలనే దృఢ సంకల్పంతో నూతనంగా రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని, దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే అమలు అవుతున్నాయని వివరించారు.

తెలంగాణ రాష్టాన్ని అభివృద్ధి మార్గంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ ప్రజానీకం ఎప్పుడు అండగా ఉండాలని తెలంగాణ శాసన మండలి ప్రొటెం చైర్మన్ వి.భూపాల్ రెడ్డి కోరారు.

ఈ కార్యక్రమంలో బారతినగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి,ఆర్ సి పురం కార్పొరేటర్ పుష్ప నగేష్, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపిటిసిలు, సర్పంచులు, తహసిల్దార్, తదితరులు పాల్గొన్నారు.

Share This Post